News November 16, 2025

వరంగల్: వడ్డీ వ్యాపారుల గిరి గిరి తంతు..!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫైనాన్స్ పేరుతో వడ్డీ వ్యాపారులు పేదలను తీవ్రంగా దోపిడీ చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అధిక వడ్డీలు విధించి చిన్న వ్యాపారుల నడ్డి విరుస్తున్నారు. కట్టలేకపోతే బెదిరింపులు, గొడవలు రోజువారీగా మారాయి. అనుమతులు లేకుండా రూ.కోట్ల లావాదేవీలు జరిపినా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు ఆర్థికంగా నలిగిపోతున్నారు. కానీ నియంత్రణ వ్యవస్థ నిమ్మకునీరెత్తనట్టుగా వ్యవహరిస్తోంది.

Similar News

News March 13, 2026

తిరుపతిలో చిన్నారి మృతికి కారణం ఇదే..!

image

తిరుపతి ప్రసూతి ఆసుపత్రిలో రెండు రోజుల <<19369150>>పసికందు చనిపోయిన <<>>విషయం తెలిసిందే. దీనిపై ఆసుపత్రి సూపరిటెండెంట్ ప్రమీలాదేవి స్పందించారు. ‘పాలు తాగిన వెంటనే పడుకోబెట్టారు. దీంతో చిన్నారి ఊపిరితిత్తుల్లోకి పాలు వెళ్లాయి. రుయా చిన్నపిల్లల ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. మిల్క్ ఆస్పిరేషన్ కారణంగా మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు’ అని ఆమె తెలిపారు

News March 13, 2026

బుక్ చేసిన 72 గంటల్లో సిలిండర్ డెలివరీ అవ్వాలి: అనకాపల్లి జేసీ

image

వినియోగదారులు తమ గ్యాస్‌ను బుక్ చేసుకున్న 72 గంటల్లో సిలిండర్ డెలివరీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని జేసీ సౌర్యమాన్ పటేల్ ఆదేశించారు. శుక్రవారం అనకాపల్లి కలెక్టరెట్‌లో డిస్ట్రిబ్యూటర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి గ్యాస్ ఏజెన్సీ వద్ద సేల్స్ ఆఫీసర్, తహశీల్దార్ ఫోన్ నంబర్‌లు ఉండాలన్నారు. అధికంగా ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News March 13, 2026

పరీక్ష ఏర్పాట్లను పరిశీలించిన డీఈవో

image

జిల్లాలో శనివారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల ఏర్పాట్లను డీఈఓ శుక్రవారం పరిశీలించారు. పాల్వంచలోని రెజీనా పాఠశాల పరీక్షా కేంద్రాన్ని సందర్శించి విద్యార్థుల సిట్టింగ్ సౌకర్యాలను తనిఖీ చేశారు. ఎండల దృష్ట్యా కేంద్రాల వద్ద తాగునీరు, నిరంతర విద్యుత్ సౌకర్యం కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని సూచించారు.