News November 16, 2025

రేపు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్న కలెక్టర్

image

ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కలెక్టరేట్‌లో సోమవారం PGRSను నిర్వహించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఈ వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమం సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు.

Similar News

News March 11, 2026

నెల్లూరు: KGBVలలో అడ్మిషన్ల ప్రారంభం

image

నెల్లూరు జిల్లాలోని 12 KGBVల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్రశిక్ష APC వెంకటసుబ్బయ్య తెలిపారు. 6వ తరగతిలో 40, ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 40 సీట్లు ఉన్నాయన్నారు. 7 నుంచి 10వ తరగతి, ఇంటర్ సెకండ్ ఇయర్‌లో మిగిలిన సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అనాథ, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్, పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బాలికలే అర్హులని చెప్పారు. apkgbv.apcfss.in ద్వారా అప్లికేషన్లు పొందాలి.

News March 11, 2026

నెల్లూరు జిల్లాలో గ్యాస్ కష్టాలు..!

image

యుద్ధం ఎఫెక్ట్‌తో నెల్లూరు జిల్లాలో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. బుచ్చి మండలంలో గతంలో బుకింగ్ చేసిన 24 గంటల్లో డెలీవరీ చేస్తుండగా.. ఇఫ్పుడు రెండు రోజులకూ ఇవ్వడం లేదు. బ్లాక్‌లో విక్రయించుకునేందుకు డీలర్లు కొరత సృష్టిస్తున్నారని ప్రజలు అనుమానిస్తున్నారు. సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సకాలంలో సిలిండర్ అందేలా చూడాలని కోరుతున్నారు. మీ ఏరియాలో పరిస్థితి ఏంటో కామెంట్ చేయండి.

News March 11, 2026

నెల్లూరులో భారీగా మొబైల్ ఫోన్లు సీజ్

image

నెల్లూరులోని పలు మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ దుకాణాలపై అధికారులు దాడులు చేశారు. సరైన బిల్లులు, GST చెల్లించకుండా విక్రయిస్తున్న రూ.49.24 లక్షల విలువైన మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ పరికరాలను సీజ్ చేశారు. ఈ సరుకును వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు అప్పగించారు. జై అంబికా, శ్రీ అంబికా, జేపీ మొబైల్స్ షాపుల్లో విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ నరసింహారావు, DCTO విష్ణు రావు దాడులు చేశారు.