News November 16, 2025
కార్మికులపై CBN వ్యాఖ్యలు దారుణం: రామకృష్ణ

AP: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై CM చంద్రబాబు <<18299181>>వ్యాఖ్యలను<<>> ఖండిస్తున్నామని CPI జాతీయ కార్యదర్శి రామకృష్ణ చెప్పారు. కార్మికులు పనిచేయకుండా జీతాలు తీసుకుంటున్నారనడం దారుణమన్నారు. ఆయన మాటలు తెలుగు జాతిని అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. వెంటనే ఆ వ్యాఖ్యలను చంద్రబాబు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్సెలార్ మిట్టల్‌కు క్యాప్టివ్ మైన్స్ అడుగుతారు కానీ విశాఖ స్టీలుకు ఎందుకు అడగరని ప్రశ్నించారు.
Similar News
News March 21, 2026
డిన్నర్‌కు వెళ్లా అంతే..: పుట్టా మహేశ్

AP: మొయినాబాద్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో TDP అధిష్ఠానానికి MP పుట్టా మహేశ్ వివరణ ఇచ్చారు. డిన్నర్ కోసం పిలిస్తే అక్కడికి వెళ్లానని, డ్రగ్స్ తీసుకోలేదని స్పష్టం చేశారు. డ్రగ్స్ తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో TDP <<19392082>>షోకాజ్<<>> నోటీస్ ఇచ్చింది. 5 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. మరోవైపు TG మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డికీ BRS షోకాజ్ నోటీస్ ఇవ్వగా ఆయన స్పందించాల్సి ఉంది.
News March 21, 2026
₹18 కోట్లు చెల్లించి హార్ముజ్‌ను దాటిన నౌక!

హార్ముజ్ జలసంధి నుంచి వెళ్లే ఆయిల్ ట్యాంకర్ల నుంచి ఇరాన్ <<19429670>>టోల్ ఫీజు<<>> వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సేఫ్‌గా వెళ్లేందుకు ఓ చమురు నౌక $2 మిలియన్లు(₹18.7 కోట్లు) చెల్లించినట్లు లాయిడ్స్ లిస్ట్ వెల్లడించింది. ఇండియా, మలేషియా, చైనా, పాక్ సహా పలు దేశాలు తమ నౌకలకు సురక్షిత మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు ఇరాన్‌తో చర్చిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటిదాకా 9 నౌకలు ఇరాన్ తీరం నుంచి వెళ్లినట్లు పేర్కొంది.
News March 21, 2026
ఇవాళ సెలవు

రంజాన్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ఉండనుంది. తొలుత జారీ చేసిన హాలిడేస్ లిస్ట్‌లో సెలవు నిన్న ఉండగా నెలవంక దర్శనం ఆధారంగా పండుగ శనివారం జరుపుకోవాలని ముస్లిం మతపెద్దలు నిర్ణయించారు. దీంతో ప్రభుత్వాలు నేడు సెలవు దినంగా ప్రకటించాయి. ఈ కారణంగా ఏపీలో ఇవాళ జరగాల్సిన పదో తరగతి ఇంగ్లిష్ పరీక్షను ఏప్రిల్ 2కు వాయిదా వేశారు.


