News April 12, 2024

మల్టిపుల్ సెక్స్ పార్ట్‌నర్స్‌ ర్యాంకింగ్స్‌లో భారత్ స్థానం ఎంతంటే!

image

భారత్‌కు చెందినవారు తన జీవిత కాలంలో సగటున ముగ్గురు లైంగిక భాగస్వాముల్ని కలిగి ఉన్నట్లు WPR అధ్యయనంలో తేలింది. 46దేశాల్లో సర్వే చేయగా భారత్ చివరి స్థానంలో నిలిచింది. కాగా సగటున ఓ వ్యక్తి 14.5 మంది లైంగిక భాగస్వాముల్ని కలిగి ఉండటంతో తుర్కియే దేశం తొలి స్థానంలో ఉంది. భారతీయ విలువలు, సంస్కృతే ఈ జాబితాలో మన దేశం అట్టడుగున నిలవడానికి కారణమని.. ఇది మంచి పరిణామమని విశ్లేషకులు చెబుతున్నారు.

Similar News

News January 25, 2026

తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందికి పద్మశ్రీలు

image

కేంద్రం ప్రకటించిన 113 పద్మశ్రీ అవార్డుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 11 మంది ఎంపికయ్యారు. TG నుంచి సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో చంద్రమౌళి, కుమారస్వామి తంగరాజ్, కృష్ణ‌మూర్తి, మెడిసిన్‌లో వెంకట్ రావు, విజయ్ ఆనంద్, రామారెడ్డి(పశు-వైద్య పరిశోధనలు), దీపికా రెడ్డి(కళా విభాగం) ఎంపికయ్యారు. AP నుంచి వెంపటి కుటుంబ శాస్త్రి(సాహిత్యం), కళా విభాగంలో బాలకృష్ణ ప్రసాద్, మురళీ మోహన్, రాజేంద్రప్రసాద్ ఉన్నారు.

News January 25, 2026

వర్క్-లైఫ్ బ్యాలెన్స్ చేయండిలా..

image

ఈ రోజుల్లో ఎక్కువమంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే, ఓ వైపు ఆఫీస్.. మరోవైపు ఇల్లు.. రెండింటినీ బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాదు. కాబట్టి మహిళలు తమ చుట్టూ హెల్పింగ్ మెకానిజం‌ను ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి పనుల్లో కుటుంబసభ్యులు సాయం తీసుకోవాలి. కుదిరినప్పుడల్లా వారితో సమయం గడపాలి. ఆఫీస్‌లో వర్క్ లోడ్ ఎక్కువైతే సహోద్యోగులతో పని పంచుకోండి. అవసరమైనప్పుడు మీరూ వారికి సాయపడితే ఒత్తిడి తగ్గించుకోవచ్చు.

News January 25, 2026

బృహస్పతి చంద్రుడిపై జీవం ఉందా?

image

బృహస్పతి (Jupiter) చంద్రుడైన యూరోపాపై ఆసక్తికరమైన ప్రక్రియ జరుగుతోంది. బరువైన ఉప్పు మంచు గడ్డలు క్రమంగా లోపల ఉన్న సముద్రాన్ని చేరుతున్నాయి. దీంతో జీవం మనుగడకు అవసరమైన ఆక్సిజన్ వంటి పోషకాలు సముద్రంలోకి చేరుతున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ‘సింకింగ్ ఐస్’ విధానంతో జీవం మనుగడకు అవకాశం ఉంది. నాసా 2024లో ప్రయోగించిన ‘యూరోపా క్లిప్పర్ మిషన్’ 2030కి అక్కడికి చేరుకొని రహస్యాలను వెలికి తీయనుంది.