News November 16, 2025
మీకోసం కాల్ సెంటర్ సేవలు వినియోగించుకోండి: కలెక్టర్

పల్నాడు జిల్లా కలెక్టరేట్‌లో నవంబర్ 17న సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ కృత్తికా శుక్లా తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీకోసం కాల్ సెంటర్ సేవలను ఉపయోగించుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను Meekosam.ap.gov.inలో లేదా 1100 నంబర్‌కు కాల్ చేసి నమోదు చేసుకోవచ్చని కోరారు.
Similar News
News April 2, 2026
TPT: టెన్త్ పరీక్షలు.. 145 మంది గైర్హాజరు

రాష్ట్ర వ్యాప్తంగా గురువారం 10వ తరగతి ఆంగ్లం పరీక్ష జరిగింది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 26,825 మంది విద్యార్థులకు గాను 26,680 మంది హాజరుకాగా 145 మంది గైర్హాజరు అయినట్లు DEO కుమార్ పేర్కొన్నారు. 165 పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా పరీక్షలు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు.
News April 2, 2026
శ్రీకాకుళం జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్

శ్రీకాకుళం జిల్లాలోని పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు ఉన్న 7 రైల్వే స్టేషన్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ఖుర్దా రోడ్డు డివిజన్ నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖపట్నం డివిజన్‌కు బదిలీ చేయబడటం స్థానిక ప్రజల్లో ఆనందం కలిగించింది. ఈ మార్పుతో పరిపాలనా సామర్థ్యం పెరిగి, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందనున్నాయని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
News April 2, 2026
ఒరాకిల్‌లో వారి ఉద్యోగాలే పోయాయా?

ఒరాకిల్ లేఆఫ్స్‌పై ఓ మాజీ ఉద్యోగిని చేసిన లింక్డిన్ పోస్ట్ ఐటీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. 34 ఏళ్లుగా కంపెనీలో పనిచేస్తున్న నీనా లూయిస్ 30 వేల మందిని తొలగించడంపై షాకింగ్ ఆరోపణ చేశారు. ఈ తొలగింపులు యాదృచ్ఛికంగా జరగలేదని.. ఒక ‘అల్గారిథమ్’ ఉందని ఆరోపించారు. ముఖ్యంగా కంపెనీలో ఎక్కువ స్టాక్ ఆప్షన్స్ ఉండి, అధిక జీతం తీసుకునే సీనియర్స్‌ను, మిడ్-లెవల్ మేనేజర్లనే టార్గెట్ చేసినట్లు తెలిపారు.


