News November 16, 2025
అదరగొట్టిన IND బౌలర్లు.. 132 పరుగులకే SA-A ఆలౌట్

రాజ్‌కోట్ వేదికగా ఇండియా-Aతో జరుగుతోన్న రెండో అనధికార వన్డేలో సౌతాఫ్రికా-A 132 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టు బ్యాటర్లలో రివాల్డో మూన్‌సామి (33) టాప్ స్కోరర్‌గా నిలిచారు. భారత బౌలర్లలో నిశాంత్ సింధు 4, హర్షిత్ రాణా 3, ప్రసిద్ధ్ 2 వికెట్లు పడగొట్టగా తిలక్ వర్మ ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచులో గెలవాలంటే ఇండియా-A 50 ఓవర్లలో 133 రన్స్ చేయాలి. కాగా తొలి వన్డేలో IND-A గెలిచిన విషయం తెలిసిందే.
Similar News
News November 16, 2025
WTC: నాలుగో స్థానానికి పడిపోయిన భారత్

SAతో తొలి టెస్టులో ఓటమితో భారత్ WTC పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది. టీమ్ ఇండియా ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడి 4 విజయాలు, 3 ఓటములు, ఓ మ్యాచ్ డ్రాగా ముగించింది. ప్రస్తుతం IND విజయాల శాతం 54.17గా ఉంది. ఇక ఆడిన 3 మ్యాచుల్లోనూ గెలిచిన AUS అగ్రస్థానంలో ఉండగా, సఫారీలు(విజయాల శాతం 66.67) రెండో స్థానంలో ఉన్నారు. 3, 5, 6, 7వ స్థానాల్లో SL(66.7), PAK(50.00), ENG(43.33), BAN(16.7) ఉన్నాయి.
News November 16, 2025
టెట్ ఫలితాల విడుదల అప్పుడే: విద్యాశాఖ

TG: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) దరఖాస్తుల ప్రక్రియ నిన్నటి నుంచి ప్రారంభమైంది. వచ్చే ఏడాది జనవరి 03 నుంచి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షల ఫలితాలను ఫిబ్రవరి 10-16వ తేదీ మధ్య వెల్లడిస్తామని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈడబ్ల్యూఎస్ కోటా అభ్యర్థులు కూడా జనరల్ కోటా మాదిరిగానే మార్కులు సాధించాల్సి ఉంటుందని పేర్కొంది.
News November 16, 2025
250 ఉద్యోగాలకు నోటిఫికేషన్

కేంద్ర క్యాబినెట్ సెక్రటేరియట్‌లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 250 గ్రూప్-B పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ వెలువడింది. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు గేట్ 2023/24/25 స్కోర్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. వయసు 30 ఏళ్లు మించరాదు. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జీతం రూ.99,000 వరకు ఉంటుంది. పూర్తిస్థాయి నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది.
వెబ్‌సైట్: https://cabsec.gov.in/


