News November 16, 2025

జిల్లాలో లాటరీ మోసాలపై ఉక్కుపాదం: ఎస్పీ నరసింహ

image

సూర్యాపేట జిల్లాలో స్థిరాస్తి లాటరీల పేరుతో జరిగే ఆర్థిక మోసాలపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ నరసింహ హెచ్చరించారు. ‘1000 కట్టు.. ఫ్లాటు పట్టు’ వంటి మోసపూరిత పథకాల ద్వారా అమాయకులను లక్ష్యంగా చేసుకునే వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని స్పష్టం చేశారు. లాటరీల రూపంలో భూములు, ఫ్లాట్లు అమ్మడం చట్టవిరుద్ధం అన్నారు. అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.

Similar News

News March 13, 2026

TODAY HEADLINES

image

*LPGపై ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నారు: మోదీ
*దేశంలో గ్యాస్ లభ్యతపై ఆందోళన నెలకొంది: రాహుల్
*పారిశ్రామిక హబ్‌గా ఏపీ: చంద్రబాబు
*నర్సరీ నుంచి 12వ తరగతి విధానం తీసుకొస్తాం: రేవంత్
*TG: ఈనెల 15 నుంచి ఒంటిపూట బడులు
*16న విచారణకు హాజరు కావాలని కవితకు సీబీఐ నోటీసులు
*US నౌకపై ఇరాన్ దాడి.. ఇండియన్ మృతి
*గ్యాస్ కొరత నేపథ్యంలో రాష్ట్రాలకు కిరోసిన్ సరఫరా పెంపు

News March 13, 2026

‘పది’ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: DEO

image

ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే పదో తరగతి పరీక్షలకు కృష్ణా జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా విద్యాశాఖ అధికారి యూవీ సుబ్బారావు తెలిపారు. జిల్లాలోని మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు డివిజన్లలో మొత్తం 411 పరీక్షా కేంద్రాల్లో 22,232 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని చెప్పారు. ప్రశ్నాపత్రాల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి, ఫ్లయింగ్ స్క్వాడ్ నియమించినట్లు తెలిపారు.

News March 13, 2026

వార్ ఎఫెక్ట్.. కేంద్రానికి భారంగా ఫర్టిలైజర్ సబ్సిడీ!

image

ఇరాన్ యుద్ధంతో చమురు ధరలు పెరగడం, సరఫరాలో అంతరాయాల కారణంగా ఎరువుల సబ్సిడీ ఖర్చు కేంద్రానికి భారంగా మారనుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఈ సబ్సిడీల బడ్జెట్ అంచనా ₹1.7లక్షల కోట్లు కాగా ఇప్పుడది ₹2.2 లక్షల కోట్లకు చేరొచ్చని కేంద్రవర్గాల సమాచారం. కాగా వచ్చే ఆర్థిక సంవత్సరం కోసం ₹1.71లక్షల కోట్లలో ఫర్టిలైజర్ సబ్సిడీకి ₹1.16లక్షల కోట్లు, నాన్-యూరియా ఫర్టిలైజర్స్‌కు ₹54వేల కోట్లను కేంద్రం కేటాయించింది.