News November 16, 2025

ASF జిల్లా స్థాయి యువజన కళాకారుల ఎంపిక

image

జాతీయ యువజన ఉత్సవాల సందర్భంగా ఈ నెల 18న ఉదయం 11 గంటలకు జిల్లా స్థాయి యువజన కళాకారుల ఎంపికను అసిఫాబాద్‌లోని ఆదివాసీ భవన్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 15 నుంచి 29ఏళ్లలోపు వారు ఈ పోటీలలో పాల్గొనవచ్చన్నారు. జిల్లాస్థాయిలో ప్రథమ స్థానం సాధించిన వారిని రాష్ట్ర స్థాయి ఉత్సవాలకు పంపిస్తామని పేర్కొన్నారు.

Similar News

News November 16, 2025

ధర్మబద్ధంగా జీవించడమే స్వర్గానికి మార్గం

image

బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం|
లోకనాథం మహద్భూతం సర్వభూతభవోద్భవమ్||
అన్ని ధర్మాలు తెలిసిన, మనందరికీ కీర్తిని, అభివృద్ధిని ఇచ్చే ప్రపంచ నాయకుడు, గొప్పవాడు, సకల జీవరాశికి పుట్టుకకు, ఉనికికి మూలమైనవాడు విష్ణుమూర్తి. ఆయన బోధించిన ధర్మాన్ని మనం మన జీవితంలో పాటించాలి. సకల సృష్టికి మూలమైన ఆయనను స్మరిస్తూ ధర్మబద్ధంగా జీవిస్తే స్వర్గానికి మార్గం సుగమం అవుతుందని నమ్మకం. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>

News November 16, 2025

కొడుకు రూ.కోట్లు కొల్లగొట్టినా.. పెన్షన్ సొమ్మే తండ్రికి దిక్కు..!

image

<<18305145>>iBOMMA<<>> వెబ్‌సైట్‌ నిర్వాహకుడు రవి స్వస్థలం ఆరిలోవ. డిగ్రీ వరకు విశాఖలోనే చదివాడు. అతని తండ్రి అప్పారావు బీఎస్ఎన్ఎల్‌లో పనిచేసి రిటైర్ అయ్యారు. అతని కుమార్తె విదేశాల్లో స్థిరపడింది. అతని భార్య మృతి చెందడంతో ఒంటరిగా నివసిస్తున్నారు. రవి రూ.కోట్లు కొల్లగొడితే.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న అతని తండ్రి ‘నాకు వచ్చే పింఛన్ సొమ్ముతోనే జీవనం నెట్టుకొస్తున్నా’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.

News November 16, 2025

IND vs PAK.. మరోసారి ‘నో హ్యాండ్ షేక్’

image

ACC మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2025 టోర్నీలో భాగంగా దోహాలో ఇండియా-A, పాకిస్థాన్-A మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ సమయంలో పాక్ కెప్టెన్‌కు భారత కెప్టెన్ జితేశ్ శర్మ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఆసియా కప్ నుంచి ఇది కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుత మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన IND-A 19 ఓవర్లలో 136 రన్స్‌కి ఆలౌటైంది. వైభవ్(45), నమన్(35) ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు నిరాశపరిచారు.