News November 16, 2025
సరికొత్త రీతిలో మోసాలు.. జాగ్రత్త: ADB SP

సైబర్ నేరగాళ్లు సరికొత్త రీతీలో మోసం చేస్తున్నారని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని SP అఖిల్ మహాజన్ సూచించారు. గతవారం జిల్లాలో 11 కేసులో నమోదైనట్లు వెల్లడించారు. ఆన్‌లైన్ జాబ్స్, ఏపీకే ఫైల్ ఫ్రాడ్, లోన్ ఇస్తామంటూ వచ్చే యాడ్స్ నమ్మవద్దని వివరించారు. రూ.2 నోటుకు రూ.32 లక్షలు ఇస్తామంటూ వచ్చే ప్రచారాలు అవాస్తవమని వాటిని నమ్మకూడదన్నారు. ఎవరైనా మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
Similar News
News March 8, 2026
చిత్తూరు: పెరుగుతున్న చికెన్ ధరలు

చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.179 నుంచి రూ.186, మాంసం రూ.260 నుంచి 295 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.295 నుంచి రూ.320వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు12 కోడిగుడ్ల ధర రూ. 72 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News March 8, 2026
నల్గొండ: గ్యాస్ సెగ.. సామాన్యుడిపై రూ.70 కోట్ల అదనపు భారం

కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచి సామాన్యుడి వంటింట్లో మంటలు రేపింది. డొమెస్టిక్ సిలిండర్‌పై రూ.60, కమర్షియల్ సిలిండర్‌పై రూ.115 చొప్పున పెంచడంతో పేద, మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తాజా పెంపుతో ఉమ్మడి జిల్లాలోని వినియోగదారులపై ఏడాదికి సుమారు రూ.70 కోట్ల మేర అదనపు భారం పడనుంది. ధరల పెరుగుదలపై జిల్లా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
News March 8, 2026
నల్గొండ: దేశంలోనే అరుదైన దేవాలయం మన దగ్గరే..

నల్గొండ జిల్లా అడవిదేవులపల్లిలో కృష్ణానది ఒడ్డున విశిష్టమైన సూర్య దేవాలయం కొలువై ఉంది. దేశంలోనే పడమర దిక్కున ఉన్న ఏకైక సూర్య దేవాలయంగా ఈ ఆలయం గుర్తింపు పొందింది. ఇక్కడ సూర్యాస్తమయ సమయంలో కిరణాలు నేరుగా స్వామివారి పాదాలను తాకడం విశేషం. విశ్వామిత్ర మహర్షి సర్పయాగం చేసిన ఈ ప్రాంతంలో, కాకాసురుని వధ జరిగినందున కాకులు కనిపించవని భక్తుల నమ్మకం. ఈ గుడిని 800 ఏళ్ల క్రితం కల్యాణ చాళుక్యులు నిర్మించారు.


