News November 16, 2025
జగిత్యాల: 10 నెలల్లో 8,686 కేసులు

రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను కఠినంగా కొనసాగిస్తున్నామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానాలు, జైలు శిక్షలు తప్పవని ఆయన హెచ్చరించారు. గత 10 నెలల్లో జిల్లాలో 8,686 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మత్తులో ప్రమాదాలకు కారణమైన వారిపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నామని వెల్లడించారు.
Similar News
News March 25, 2026
పశ్చిమాసియా యుద్ధంపై ప్రకాశ్ రాజ్ సెటైర్

US-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంపై నటుడు ప్రకాశ్ రాజ్ సెటైర్ వేశారు. ‘యుద్ధం లక్ష్యం ఇప్పుడు “హార్ముజ్” జలసంధిని తెరవడం వైపు మళ్లినట్లు కనిపిస్తోంది. నిజానికి యుద్ధం మొదలవ్వకముందు అది తెరిచే ఉంది’ అని లాఫింగ్ ఎమోజీతో ఆయన ట్వీట్ చేశారు. కాగా తమతో శత్రుత్వం లేని దేశాల నౌకలు హార్ముజ్ నుంచి రాకపోకలు కొనసాగించవచ్చని ఇరాన్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
News March 25, 2026
పల్నాడు: ఎమ్మెల్యేలకు టెన్షన్ స్టార్ట్..!

నియోజకవర్గాల పునర్విభజన అంశం పల్నాడు జిల్లా ఎమ్మెల్యేల్లో గుబులు రేపుతోంది. ప్రస్తుతం 7గా ఉన్న అసెంబ్లీ స్థానాలు 11కి పెరిగే అవకాశం ఉండటంతో, రిజర్వేషన్ల మార్పుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు ఎవరి సీటుకు ఎసర పెడతాయోనని నేతలు ఆందోళన చెందుతున్నారు. తారుమారయ్యే మండలాలపై పట్టు సాధించడం ఇప్పుడు అభ్యర్థులకు కత్తిమీద సాములా మారింది.
News March 25, 2026
కాంగ్రెస్‌కు గుడ్‌బై.. 7000 మందితో BRSలోకి జీవన్‌రెడ్డి?

మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్‌కు నేడు ఆయనతో పాటు సుమారు 7000 మంది అనుచరులు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. పార్టీ మారిన 10 మంది MLAలను టార్గెట్‌గా చేసుకొని వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామంతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశముంది. వచ్చేనెల 5 నుంచి 10లోపు భారీ సభలో మాజీ CM KCR సమక్షంలో BRSలో చేరనున్నట్లు సమాచారం.


