News November 16, 2025
మెదక్: 1.19 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

జిల్లాలో ఇప్పటివరకు 27,993 మంది రైతుల నుంచి 1,19,461.560 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, రూ.102.84 కోట్ల చెల్లింపులు జరిగాయని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు వేగవంతం చేయాలని ఆదేశించారు. చిన్నశంకరంపేట మండలం అంబాజీపేటలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆదివారం ఆకస్మికంగా సందర్శించారు. కొనుగోళ్ల తీరును తీరును పరిశీలించారు.
Similar News
News April 3, 2026
పీడీఎస్ సేవలు పారదర్శకంగా ఉండాలి: నిత్యానంద్

టేక్మాల్: రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానంద్ హెచ్చరించారు. వెలుపుగొండ రేషన్ షాపును ఆకస్మికంగా తనిఖీ చేయగా 36.32 క్వింటాళ్ల బియ్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో డీలర్ దినకర్‌పై 6-ఏ నిబంధన కింద కేసు నమోదు చేశారు. నిబంధనల ప్రకారం పారదర్శక సేవలు అందించాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
News April 2, 2026
మెదక్: ఫిజికల్ సైన్స్ పరీక్షకు 99.83% హాజరు

మెదక్ జిల్లాలో 10వ తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా ఫిజికల్ సైన్స్ పరీక్షకు 99.83 శాతం విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 11,247 మందికి గాను 11,228 మంది పరీక్ష రాశారని జిల్లా విద్యాశాఖ అధికారి విజయ తెలిపారు. పరీక్షా కేంద్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు.
News April 2, 2026
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: అదనపు కలెక్టర్

అల్లాదుర్గం మండలం చిల్వర్ గ్రామంలో నిర్వహించిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ గ్రామసభలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యచరణపై ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి పేదవాడు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామసభలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి సక్రమంగా తీర్మానాలు చేయాలని అధికారులకు సూచించారు.


