News November 16, 2025
సింగరేణిలో 374 మందికి కారుణ్య నియామక పత్రాలు

కొత్తగూడెంలో సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా సందర్భంగా అన్ని ఏరియాలకు సంబంధించి 374 మందికి కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు స్థానిక MLA కూనంనేని సాంబశివరావు, సింగరేణి C&MD బలరాం చేతుల మీదుగా ఆదివారం అందజేశారు. రామగుండం ఏరియాకు చెందిన 26 మంది నియామక పత్రాలు అందుకున్నారు. ఉన్నతాధికారులు కిరణ్ కుమార్, మురళీధర్ రావు, కలెక్టర్, కార్మిక నేతలు పాల్గొన్నారు.
Similar News
News November 17, 2025
TODAY HEADLINES

✦ రాజ్యాంగం వల్లే చాయ్‌వాలా ప్రధాని అయ్యారు: CM CBN
✦ TGకి నాలుగో అద్భుతంగా RFC: CM రేవంత్
✦ రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో CBN, రేవంత్ సరదా ముచ్చట్లు
✦ TGలో రేషన్ కార్డు ఉంటేనే ఇన్‌కమ్ సర్టిఫికెట్ జారీ
✦ కూటమి ప్రభుత్వంలో భారీగా పెరిగిన అప్పులు: YS జగన్
✦ ఎర్రకోట ఆత్మాహుతి దాడి.. కీలక నిందితుడు అరెస్ట్
✦ తొలి టెస్టులో భారత్‌పై దక్షిణాఫ్రికా విజయం
News November 17, 2025
దక్షిణ చైనా సముద్రంలో బాంబర్ పెట్రోలింగ్

వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇటీవల US, జపాన్‌లతో కలిసి ఫిలిప్పీన్స్ అక్కడ నౌకాదళ విన్యాసాలు చేపట్టింది. దీనికి కౌంటర్‌గా చైనా తొలిసారిగా యుద్ధ విమానాలతో బాంబర్ ఫార్మేషన్ పెట్రోలింగ్ నిర్వహించింది. రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని ఫిలిప్పీన్స్‌ను హెచ్చరించింది. దక్షిణ చైనా సముద్రమంతా తమదేనని డ్రాగన్ వాదిస్తుండగా దీనికి చెక్ పెట్టేందుకే ఫిలిప్పీన్స్ విన్యాసాలు చేపట్టింది.
News November 17, 2025
PDPL: రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

PDPL(D) సుల్తానాబాద్ మం.లోని చిన్నకల్వల వద్దగల రాజీవ్ రహదారిపై కారు ఢీకొన్న ఘటనలో ఇదే గ్రామానికి చెందిన రాపెళ్లి రాజేశం(72) అక్కడికక్కడే మృతిచెందాడు. SI శ్రావణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజేశం ఇంట్లోని చెత్తను ఇంటి ముందు ఉన్న చెత్తకుండీలో వేసి వెనుకకు తిరిగి వెళ్తున్నాడు. ఈ క్రమంలో కరీంనగర్- పెద్దపల్లివైపు అతివేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.


