News November 16, 2025

టెట్​ ఫలితాల విడుదల అప్పుడే: విద్యాశాఖ

image

TG: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET)​ దరఖాస్తుల ప్రక్రియ నిన్నటి నుంచి ప్రారంభమైంది. వచ్చే ఏడాది జనవరి 03 నుంచి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ ​పరీక్షల ఫలితాలను ఫిబ్రవరి 10-16వ తేదీ మధ్య వెల్లడిస్తామని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈడబ్ల్యూఎస్​ కోటా అభ్యర్థులు కూడా జనరల్​ కోటా మాదిరిగానే మార్కులు సాధించాల్సి ఉంటుందని పేర్కొంది.

Similar News

News March 15, 2026

LPG కంటే PNG బెటర్ అంటున్న నిపుణులు!

image

దేశ ప్రజలు ఎల్పీజీ కాకుండా PNG (పైప్డ్ నేచురల్ గ్యాస్)వైపు మళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. మన దేశానికి దిగుమతి అయ్యే LPGలో 90% హార్ముజ్ నుంచే వస్తోంది. ఇప్పుడది క్లోజ్ కావడంతో ఇబ్బందులు వస్తున్నాయి. అయితే LPGతో పోలిస్తే PNGకి డిమాండ్ తక్కువగా ఉంది. అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా లాంటి పలు దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం కాబట్టి కొరత వచ్చే రిస్క్ తక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

News March 15, 2026

‘ఉగాది’ పండుగ ఎప్పుడు?

image

అమావాస్య గడియలు ఉండటంతో తెలుగు కొత్త సంవత్సరాది ‘ఉగాది’ ఎప్పుడు జరుపుకోవాలనే అయోమయం కొందరిలో నెలకొంది. అయితే చైత్ర శుక్ల పాడ్యమి రోజైన ఈ నెల 19(గురువారం)నే ఉగాది జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. 19న ఉదయం 6.52 గంటలకు ‘పరాభవ నామ సంవత్సరం’ మొదలవుతుందని పేర్కొంటున్నారు. అదేరోజు ఇంట్లో షడ్రుచులతో ఉగాది పచ్చడి తయారుచేసి స్వీకరించాలని సూచిస్తున్నారు.

News March 15, 2026

TVKతో పొత్తు ఉండదు: పళనిస్వామి

image

TNలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో TVKతో పొత్తు ఉండబోదని AIADMK జనరల్ సెక్రటరీ K.పళనిస్వామి తెలిపారు. మీడియాలో వస్తున్నవంతా వదంతులేనని కొట్టిపారేశారు. ఇప్పటి వరకు ఆ పార్టీతో అసలు చర్చలే జరపలేదన్నారు. అలాగే BJP లీడర్ అన్నామలైతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. మరోవైపు NDAతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని స్టార్ హీరో, TVK చీఫ్ విజయ్ పేర్కొన్న సంగతి తెలిసిందే.