News April 12, 2024

టెస్లా ప్లాంట్ ఏపీలో పెట్టండి: మస్క్‌కి లోకేశ్ విజ్ఞప్తి

image

AP: టెస్లా అధినేత మస్క్ భారత పర్యటనకు విచ్చేస్తున్న వేళ ఆయనకు ఆహ్వానం పలుకుతూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ‘మీరు భారత్ రావడం ఆనందంగా ఉంది. 2017లో మీరు చంద్రబాబు గారిని కలిసి ఆంధ్రప్రదేశ్‌పై ఆసక్తి కనబర్చారు. టెస్లా ప్లాంట్ నెలకొల్పేందుకు ఏపీ సరైన ఎంపిక. ఇక్కడ నైపుణ్యం కలిగిన యువత, సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. టెస్లా విషయంలో మీ లక్ష్యాలు నెరవేరేందుకు మా రాష్ట్రం సహాయపడుతుంది’ అని ట్వీట్ చేశారు.

Similar News

News January 20, 2026

ముగిసిన టెట్ ఎగ్జామ్స్.. ఈ నెల 30న ‘కీ’

image

TG: రాష్ట్రంలో ఈ నెల 3న ప్రారంభమైన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) పరీక్షలు నేటితో ముగిశాయి. పేపర్-1,2కు మొత్తం 2.38 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 82.09 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రస్తుతం టీచర్లుగా కొనసాగుతున్నవారు టెట్ రాయాల్సిందేనన్న సుప్రీంకోర్టు తీర్పుతో ఈసారి 71,670 మంది ఇన్ సర్వీస్ టీచర్లు అప్లై చేశారు. ఈ నెల 30న ‘కీ’, ఫిబ్రవరి 10-16 మధ్య ఫలితాలు వెలువడనున్నాయి.

News January 20, 2026

తినేటప్పుడు మాట్లాడుతున్నారా? ఈ విషయాలు తెలుసా!

image

ఆహారం తీసుకునేటప్పుడు మాట్లాడితే డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నోటి ద్వారా అధికంగా గాలి పొట్టలోకి చేరి తేన్పులు, గ్యాస్ సమస్యలు రావొచ్చు. ఒక్కోసారి అన్నవాహికలోకి కాకుండా గాలి వెళ్లే గొట్టంలోకి ఆహారం వెళ్లి గొంతునొప్పి, తీవ్రమైన దగ్గు వస్తుంది. ఎక్కువగా తినడంతో బరువు పెరిగే ప్రమాదం ఉంది. సరిగ్గా నమలకపోవడంతో జీర్ణరసాలు ఆహారంలో కలవక అసిడిటీ సమస్యలు తలెత్తుతాయి.

News January 20, 2026

స్థలం చిన్నదైనా ఇంకుడు గుంత తవ్వాలా?

image

స్థలం చిన్నదైనా వాస్తు నియమాలు పాటిస్తూ కనీస సౌకర్యాలు కల్పించుకోవడం సాధ్యమే అంటున్నారు వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు. నీటి వసతి కోసం నిర్మించే సంపు, ఇంకుడు గుంతలను ఈశాన్యం వైపు ఏర్పాటు చేసుకోవాలంటున్నారు. ‘అవసరమైతే గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణాన్ని తగ్గించుకోవచ్చు. ముఖ్యమైన నిర్మాణానికి ఆటంకం కలగకుండా, ఉన్న స్థలంలోనే శాస్త్రీయంగా వీటిని నిర్మించుకోవడం వల్ల ఇంటికి శుభం కలుగుతుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>