News November 16, 2025

రైలు ఢీకొని విద్యార్థి మృతి

image

కడప రైల్వే స్టేషన్‌లో శనివారం గూడ్స్ రైలు ఢీకొని మహేశ్ (21) MBA విద్యార్థి మృతి చెందినట్లు కడప రైల్వే SI సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. మహేశ్ పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందాడన్నారు. మృతుడు నంద్యాల జిల్లా బనగానపల్లె వాసి అని, కడపలోని అన్నమాచార్య కాలేజీలో చదువుతున్నట్లు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News March 22, 2026

పాడేరు: స్టీల్ ప్లాంట్‌పై విస్తృత ప్రచారం

image

అనకాపల్లి జిల్లాలో ఈనెల 23న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. శనివారం పాడేరులో టీడీపీ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్రలో 60 వేల మందికి ఉపాధి లభిస్తుందని, ముఖ్యంగా గిరిజన యువతకు ఎంతో మేలు జరుగుతుందని ఆమె వివరించారు.

News March 22, 2026

వారంలో 10% తగ్గిన బంగారం ధర

image

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. గతవారంలో బంగారం ధర 10% తగ్గింది. 2011 తర్వాత ఇదే అతిపెద్ద క్షీణత. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, డాలర్ బలోపేతం కావడం వల్ల ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. దీంతో శుక్రవారం బంగారం ఔన్సు ధర 4,492 డాలర్లకు చేరింది. వెండి కూడా వారం రోజుల్లో 15% దిగొచ్చింది. దేశీయంగా MCXలో 10 గ్రాముల బంగారం ధర ₹1,44,825కు పడిపోగా కిలో వెండి ₹2,27,470 వద్ద ముగిసింది.

News March 22, 2026

HYD: రేపటి నుంచి లైఫ్ ట్యాక్స్ రద్దు

image

అదనపు వాహనాలు కొనుగోలు చేసే వారికి పడే 2% లైఫ్ ట్యాక్స్‌ను ఈ నెల 23 నుంచి రద్దు చేస్తున్నట్లు HYDలోని అధికారులు తెలిపారు. ఈ మేరకు వాహన్ పోర్టల్‌ అందుబాటులోకి రానుందని అన్నారు. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పోర్టల్‌ను ప్రారంభిస్తారని దీని ద్వారా దేశంలో ఉన్న అన్ని వాహనాల వివరాలు ఒకే గొడుగు కిందికి రానున్నాయని వెల్లడించారు. 2% పన్ను ఎత్తివేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
# SHARE IT