News November 16, 2025
పార్వతీపురం: ‘సివిల్స్ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్’

UPSC-2026 ప్రిలిమినరీ పరీక్ష కోసం అర్హులైన పేద సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పార్వతీపురం కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం కింద ఉచిత కోచింగ్ పొందాలనుకునే అభ్యర్థులు నవంబర్ 13 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
Similar News
News March 5, 2026
బుక్కరాయసముద్రం: 10 నుంచి ఉచిత శిక్షణ

బుక్కరాయ సముద్రం ఆర్డీటీ స్కూల్లో ఈ నెల 10వ తేదీ ఇగ్నైట్ వ్యాపార శిక్షణ నిర్వహిస్తున్నట్లు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సీఈవో చంద్రమౌళి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులను వ్యాపారవేత్తలుగా మార్చడానికి ఐదు రోజులు శిక్షణ అందిస్తున్నామన్నారు. 18 నుంచి 45 ఏళ్ల వయసు గల దివ్యాంగులు ఈ శిక్షణకు అర్హులని చెప్పారు. ఉచిత వసతి, భోజనం సదుపాయాలు కల్పిస్తామన్నారు.
News March 5, 2026
మాదిగ ఉద్యోగులు వేలాదిగా తరలిరండి: మంత్రి

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి మాదిగ కులస్తులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో న్యాయం జరిగేలా కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డికి నిర్వహించే సన్మాన కార్యక్రమానికి మాదిగ ఉద్యోగులు వేలాదిగా తరలిరావాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో తెలంగాణ మాదిగ ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.
News March 5, 2026
VZM: వైద్య కాలేజీకి మృతదేహం అప్పగింత.. పలువురి అభినందన

విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం రాజుపేట గ్రామానికి చెందిన ఇల్ల జ్యోతి (43) అనారోగ్యంతో పది రోజుల క్రితం జిల్లా సర్వజన ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఆమె మృతి చెందారు. దీంతో ఆ మృతదేహాన్ని ఆమె భర్త, కుమార్తె విజయనగరం ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అప్పగించారు. మరికొంతమంది భావితరాల వైద్యులకు ఉపయోగపడాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. పలువురు వారి ఉద్దేశాన్ని అభినందించారు.


