News April 12, 2024
BREAKING: ఇవాళ రాత్రిలోగా ఫలితాలు విడుదల

CUET-PG ఫలితాల విడుదలపై UGC ఛైర్మన్ జగదీశ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ‘CUET-PG ఫలితాలను ఇవాళ రాత్రిలోగా విడుదల చేసేందుకు NTA ప్రయత్నిస్తోంది. ఈ ఫలితాల ద్వారా దేశంలోని యూనివర్సిటీల్లో విద్యార్థులు పీజీ కోర్సుల్లో చేరవచ్చు. గుడ్‌లక్’ అని పోస్ట్ చేశారు.
Similar News
News March 25, 2026
రాజధాని అమరావతిపై ఈ నెల 28న తీర్మానం

AP: ఈ నెల 28న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటిస్తూ సభలో తీర్మానం చేయనున్నారు. అనంతరం తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే రాజధానిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.
News March 25, 2026
ఈసారి సిక్సర్ల వీరుడు ఎవరో?

ఈసారి IPLలో సిక్సర్ల వర్షం కురవడం ఖాయమని క్రికెట్ పండితులు జోస్యం చెబుతున్నారు. ముఖ్యంగా SRHలోని హెడ్, అభిషేక్, ఇషాన్, క్లాసెన్ విరుచుకుపడతారని తెలిపారు. వారితో పాటు శాంసన్ (CSK), అలెన్ (KKR), పూరన్ (LSG), రోహిత్ శర్మ (MI), శివమ్ దూబే (CSK), వైభవ్ సూర్యవంశీ (RR), బ్రెవిస్ (CSK) ఈ రేసులో ముందున్నారు. మరి ఈ సీజన్లో ఎవరు అత్యధిక సిక్సర్లు కొడతారో కామెంట్ చేయండి.
News March 25, 2026
ఇంధనం నిల్వ.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే!

‘పానిక్ బయింగ్’ వల్లే అమ్మకాలు మూడింతలు పెరిగాయని TG పెట్రోలియం డీలర్ల సంఘం తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా డబ్బాల్లో ఇంధనం నిల్వ చేయడం ప్రమాదకరమని హెచ్చరించింది. ‘‘ఇంధనం ఆవిరై గాలిలో కలిసినా లేదా ప్లాస్టిక్ డబ్బాల్లో ‘స్టాటిక్ ఎలక్ట్రిసిటీ’ ఉత్పన్నమైనా భారీ పేలుళ్లు సంభవించవచ్చు. పెట్రోల్ నుంచి వచ్చే వాసన పీల్చితే శ్వాసకోశ సమస్యలు, తల తిరగడం, ఇతర అనారోగ్య సమస్యలొస్తాయి’’ అని నిపుణులు తెలిపారు.


