News November 17, 2025
NZB: లోక్ అదాలత్‌లో 4,898 కేసుల పరిష్కారం

గత నెల రోజుల నుంచి ఈ నెల 15 వరకు నిర్వహించిన స్పెషల్ లోక్ అదాలత్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 4,898 కేసులు పరిష్కారమైనట్లు సీపీ సాయి చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా, సైబర్ క్రైమ్‌కు గురైన బాధితులకు రూ.20,96,406 మొత్తాన్ని తిరిగి పొందేలా చర్యలు తీసుకున్నామని సీపీ పేర్కొన్నారు.
Similar News
News March 16, 2026
W.బెంగాల్.. 144 మంది అభ్యర్థులను ప్రకటించిన BJP

WB అసెంబ్లీ ఎన్నికల వేళ BJP 144 మందితో తొలి విడత అభ్యర్థుల జాబితా ప్రకటించింది. ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ స్థానమైన భవానీపూర్ నుంచి ప్రతిపక్షనేత సువేందు అధికారిని బరిలో దించింది. నందిగ్రామ్‌లోనూ ఆయనే పోటీ చేస్తున్నారు. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్న ఆ రాష్ట్రంలో APR 23, 29వ తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. అటు కేరళంలోనూ 47 మందితో తొలి విడత అభ్యర్థుల జాబితాను BJP ప్రకటించింది.
News March 16, 2026
మెదక్‌లో వివాహిత సూసైడ్

మెదక్ పట్టణంలోని ఇందిరాపురి కాలనీలో సుమలత(36) అనే గృహిణి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మందాపూర్ గ్రామానికి చెందిన సుమలత.. రాయిలాపూర్ నివాసి శశివర్ధన్ రెడ్డి 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఈ అఘాయిత్యానికి ఒడిగట్టింది. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
News March 16, 2026
శుక్రుడు మరీ ఇంత స్లోనా?

సౌర కుటుంబంలో అత్యంత వింతైన గ్రహం శుక్రుడు. సాధారణంగా గ్రహాలకు తమ చుట్టూ తాము తిరగడానికి పట్టే సమయం(రోజు) కంటే, సూర్యుడి చుట్టూ తిరగడానికి పట్టే సమయం (సంవత్సరం) ఎక్కువ. కానీ శుక్ర గ్రహం తన చుట్టూ తాను నెమ్మదిగా తిరుగుతుంది. అందుకే అక్కడ ఒక రోజు(243d) గడవకముందే ఒక సంవత్సరం(225d) పూర్తవుతుంది. ఈ కాలగమనం ఖగోళ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో


