News November 17, 2025

అమలాపురం: రౌడీ షీటర్లకు ఎస్పీ వార్నింగ్

image

శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రౌడీ షీటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రాహుల్ మీనా హెచ్చరించారు. జిల్లాలోని అయినవిల్లి, అంబాజీపేట, అల్లవరం మండలాల్లోని రౌడీ షీటర్లకు పోలీసులు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లాలో అసాంఘిక శక్తులు, రౌడీయిజం, గూండాయిజానికి తావు లేదన్నారు. పాత నేరాలను పునరావృతం చేసే వారిపై కేసు నమోదు చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.

Similar News

News March 13, 2026

నంద్యాల జిల్లాలో రూ.300కు పెరిగిన ధరలు

image

నంద్యాల జిల్లాలో చికెన్ ధరలు మళ్లీ పెరిగాయి. 15 రోజులుగా చికెన్ ధరలు చుక్కలనంటుతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు. కిలో చికెన్ ఆయా ప్రాంతాలను బట్టి రూ.280 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. కొద్ది రోజుల క్రితం రూ.200, రూ.220 ఉన్న ధరలు అమాంతం పెరగడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.

News March 13, 2026

పంత్ మరో అభిషేక్ అవుతాడా?

image

LSG కెప్టెన్ రిషభ్ పంత్ గత IPL సీజన్‌లో బ్యాటింగ్‌లో తడబడిన సంగతి తెలిసిందే. RCBపై సెంచరీ మినహా మిగతా మ్యాచుల్లో రాణించలేకపోయారు. దీంతో ఈసారి యువరాజ్ సింగ్ ఆధ్వర్యంలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇటీవల 4 రోజులపాటు ముంబైలో బ్యాటింగ్ సెషన్లు జరిగాయి. గతంలో అభిషేక్ శర్మ, గిల్, ప్రభ్‌సిమ్రాన్ వంటి బ్యాటర్లకు యువీ శిక్షణనిచ్చారు. ఈ నేపథ్యంలో అభిషేక్‌లా పంత్ రాణిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

News March 13, 2026

రేపటి నుంచి టెన్త్ పరీక్షలు.. 5min ఆలస్యమైనా అనుమతి

image

TG: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రేపు ప్రారంభం కానున్నాయి. ఉ.9.30 గంటలకు పరీక్ష మొదలవుతుందని, ఉ.9.35 వరకూ స్టూడెంట్స్‌ను ఎగ్జామ్ హాలులోకి అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. మొత్తం 5,28,239 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనుండగా 2,676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. స్టూడెంట్స్ అరగంట ముందే ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకోవాలని అధికారులు సూచించారు.