News November 17, 2025
మిర్యాలగూడలో మంత్రుల పర్యటన ఇలా..

మిర్యాలగూడలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం పర్యటించనున్నారు. ఉదయం 9:30 చేరుకొని శెట్టిపాలెం నుంచి అవంతిపురం వరకు నిర్మించనున్న ఔటర్ రింగ్ రోడ్డుకు శంకుస్థాపన చేస్తారు. కేఎన్ఎమ్ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని నూతన భవనాలను ప్రారంభిస్తారు. మున్సిపాలిటీ పరిధిలోని రూ. 75 కోట్ల 25 లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి మీడియాతో మాట్లాడనున్నారు.
Similar News
News March 14, 2026
10వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్?

AP: ఉగాది రోజున 60 విభాగాల్లో 10వేల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. డీఎస్సీలో భాగంగా 3,000కి పైగా టీచర్ పోస్టులు, 470 గ్రూప్-2, 101 గ్రూప్-1 పోస్టులు, వర్సిటీల్లో 1,500, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 1000 పోస్టులు భర్తీ చేయనున్నట్లు సమాచారం. జాబ్ క్యాలెండర్‌లో మొత్తం ఎన్ని పోస్టులు ఉంటాయో మరో 2, 3 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
News March 14, 2026
కర్నూలు జిల్లాలో ఒంటిపూట బడి.. టైమింగ్స్ ఇవే..!

ఈ నెల 16 నుంచి జిల్లా వ్యాప్తంగా ఒంటిపూట బడులు నిర్వహించాలని కర్నూలు డీఈవో సుధాకర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. స్కూళ్లు ఉదయం 7:45 గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం 12:30 గంటలకు ముగించాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థికి భోజన వసతిని కల్పించాలన్నారు. 10వ తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు.
News March 14, 2026
NGKLలో నిప్పుల కొలిమి.. 39 డిగ్రీల ఉష్ణోగ్రత

నాగర్ కర్నూల్ జిల్లాలో భానుడు భగభగలాడుతున్నాడు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా కల్వకుర్తిలో 39.0 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలోని ఇతర ప్రాంతాలైన శిరసనగండ్ల (38.9°C), వెల్టూర్, పెద్దకొత్తపల్లి (38.8°C)లలో కూడా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.


