News November 17, 2025
ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని చెప్పింది. ఈనెల 21 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది.
Similar News
News March 21, 2026
ధురంధర్-2పై టాలీవుడ్ స్టార్ల ప్రశంసలు.. ప్రకాశ్ రాజ్ కామెంట్స్ వైరల్

ధురంధర్-2 సినిమాపై అల్లు అర్జున్, జూ.ఎన్టీఆర్, మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ సహా దక్షిణాది స్టార్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే బాలీవుడ్ స్టార్లు ఎవరూ స్పందించలేదు. ఇదే విషయంపై ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు ప్రకాశ్ రాజ్ ఇటీవల ఇచ్చిన సమాధానం వైరలవుతోంది. ఎవరో కోరడం వల్లే వీరు స్పందిస్తున్నారనే అర్థం వచ్చేలా ‘దక్షిణాదికి సైతం ఆబ్లిగేషన్స్ విస్తరిస్తున్నాయనడానికి ఇవి సూచనలు’ అని పేర్కొన్నారు.
News March 21, 2026
భార్యతో ఫోన్లో మాట్లాడుతుండగా మిస్సైల్ దాడి.. భారతీయుడు మృతి

సౌదీలో జరిగిన మిస్సైల్ దాడిలో ఓ భారతీయుడు మరణించాడు. యూపీకి చెందిన రవి గోపాల్ (26) రియాద్‌లోని ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మార్చి 18న భార్యతో ఫోన్లో మాట్లాడుతుండగా ఫ్యాక్టరీ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. మిస్సైల్ శకలాలు మీద పడటంతో రవి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడని బంధువులు చెప్పారు. మృతదేహాన్ని త్వరగా ఇండియాకు పంపేందుకు సౌదీలోని ఇండియన్ ఎంబసీ ప్రయత్నిస్తోంది.
News March 21, 2026
తిరుమల పవిత్రతకు భంగం కలగకుండా చర్యలు: సీఎం

AP: తిరుమలలో భక్తులకు అందే సౌకర్యాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షించాలని CM CBN అధికారులను ఆదేశించారు. TTD పరిధిలోని ఆలయాలను ఆధ్యాత్మిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలన్నారు. బోర్డు సభ్యులు, అధికారులతో సమీక్షలో మాట్లాడుతూ ‘తిరుమల పవిత్రతకు భంగం కలిగించే చర్యలను అరికట్టాలి. అత్యాధునిక CCTVలు, ఫేస్ రికగ్నిషన్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. కాలుష్యం లేకుండా చర్యలు తీసుకోవాలి’ అని సూచించారు.


