News November 17, 2025

నేడు నక్తం పాటిస్తున్నారా?

image

ఈ పవిత్ర కార్తీక మాసంలో చివరి సోమవారానికి చాలా విశిష్టత ఉంది. గత సోమావారాల్లో ఆచరించని విధులను నేడు ఆచరిస్తే అంతకన్నా ఎక్కువ ఫలితం ఉంటుందని నమ్మకం. శివ భక్తులు ముఖ్యంగా నేడు ‘నక్తం’ దీక్షను పాటించాలని పండితులు సూచిస్తున్నారు. ఫలితంగా సకల శుభాలు కలుగుతాయని అంటున్నారు. నక్తం అంటే.. పగలు ఉపవాసం ఉండి, రాత్రికి భోజనం చేయడం. ఈ దీక్షతో శివానుగ్రహంతో అఖండ పుణ్యం లభిస్తుందని ప్రగాఢ నమ్మకం.

Similar News

News November 17, 2025

రవితేజ సినిమాలో సమంత?

image

రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో సమంత హీరోయిన్‌గా నటించే ఛాన్సుందని తెలిపాయి. గతంలో శివ దర్శకత్వంలో మజిలీ, ఖుషి సినిమాల్లో సామ్ నటించారు. దీంతో మరోసారి ఆమెను దర్శకుడు సంప్రదించినట్లు సమాచారం. దీనిపై మూవీ టీమ్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీతో, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాతో బిజీగా ఉన్నారు.

News November 17, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గి రూ.1,24,970కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.100 పతనమై రూ.1,14,550 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.2,000 తగ్గి రూ.1,73,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News November 17, 2025

బాలకృష్ణకు క్షమాపణ చెప్పిన సీవీ ఆనంద్

image

‘ఎమోజీ’ వివాదం ముదరడంతో హీరో బాలకృష్ణకు TG హోంశాఖ స్పెషల్ CS సీవీ ఆనంద్ క్షమాపణ చెప్పారు. 2 నెలల కిందట పైరసీ, బెట్టింగ్ యాప్‌ల విషయంపై టాలీవుడ్ ప్రముఖులతో ఆనంద్ సమావేశం నిర్వహించి Xలో ఓ పోస్టు చేశారు. అయితే ఈ భేటీకి బాలయ్యను ఎందుకు పిలవలేదని ఓ వ్యక్తి ప్రశ్నించగా, ఆనంద్ X ఖాతాను హ్యాండిల్ చేసే వ్యక్తి నవ్వుతున్న ఎమోజీతో రిప్లై ఇచ్చారు. దీనిపై విమర్శలు రావడంతో ఆయన పోస్టును తొలగించి సారీ చెప్పారు.