News November 17, 2025

శివుడే వైరాగి.. మరి మనకు సంపదను ప్రసాదించగలడా?

image

శివుడే వైరాగి. పైగా కైలాసంలో ఉంటాడు. పులి చర్మాన్ని ధరిస్తాడు. మరి ఆయన సంపదలను ఇవ్వగలడా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. కానీ ఆ సందేహం అవసరం లేదు. ఎందుకంటే ఆయనే మోక్షం, సంతోషం అనే శాశ్వత సంపదలకు అధిపతి. ఇక అష్టైశ్వర్యాలకు అధిపతి అయిన కుబేరుడు, శివుని ఆశీస్సులతోనే ఆ స్థానాన్ని పొందాడు. ప్రశాంతత అనే సంపదకు మూలమైన చంద్రుణ్ని తలపై ధరించి అలా కూడా మనల్ని అనుగ్రహిస్తున్నాడు.

Similar News

News November 17, 2025

రష్యా నుంచి ఆయిల్ కొనే దేశాలపై 500% టారిఫ్!

image

రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేసే దేశాల కట్టడికి అమెరికా సెనేట్ కొత్త బిల్లు తెచ్చింది. అలాంటి దేశాలపై 500% టారిఫ్ విధించేలా తెచ్చే బిల్లును సెనేటర్ లిండ్సే ప్రతిపాదించారు. దీనికి ప్రెసిడెంట్ ట్రంప్ మద్దతిచ్చారు. దీంతో భారత్, చైనా లాంటి దేశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించినట్లు సమాచారం.

News November 17, 2025

సౌదీ బస్సు ప్రమాదం.. మృతుల వివరాలపై ఇంకా రాని స్పష్టత!

image

సౌదీ బస్సు <<18308554>>ప్రమాదంలో<<>> HYD వాసులు చనిపోయినట్లు వార్తలు రావడంతో యాత్రికుల బంధువులు ట్రావెల్ ఏజెన్సీల వద్దకు చేరుకుంటున్నారు. మల్లేపల్లిలోని అల్ మీనా ట్రావెల్స్ ద్వారా అసిఫ్‌నగర్ జిర్ర ప్రాంతం నుంచి 16మంది, మెహిదీపట్నం ఫ్లైజోన్ ట్రావెల్స్ ద్వారా 24మంది, మరో ఏజెన్సీ నుంచి ఇద్దరు సౌదీ వెళ్లినట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై MP అసద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారుల నుంచి సమాచారం సేకరిస్తున్నామన్నారు.

News November 17, 2025

అముర్ ఫాల్కన్.. రోజుకు వెయ్యి కి.మీల ప్రయాణం

image

ప్రపంచంలోనే అత్యంత దూరం(22000 KM) వలస వెళ్లే పక్షుల్లో అముర్ ఫాల్కన్ జాతిది అగ్రస్థానం. సైబీరియా/ఉత్తర చైనా నుంచి వింటర్‌లో IND(ఈశాన్య రాష్ట్రాలు) మీదుగా ఆఫ్రికాకు ప్రయాణిస్తాయి. తాజాగా మణిపుర్ అముర్ ఫాల్కన్ ట్రాకింగ్ ప్రాజెక్టులో భాగంగా 3 పక్షులకు శాటిలైట్ ట్యాగ్ చేశారు. వీటిలోని ఓ మగ పక్షి రోజుకు 1000KM చొప్పున 3 రోజుల్లోనే 3100KM వెళ్లినట్లు IAS సుప్రియ వెల్లడించారు. వీటి జర్నీ అద్భుతమన్నారు.