News November 17, 2025

పుట్టపర్తిలో 340 CC కెమెరాలతో నిఘా: డీఐజీ

image

పుట్టపర్తికి వీఐపీల రాక నేపథ్యంలో 340 CC కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు అనంతపురం రేంజ్ DIG డా.షిమోషి తెలిపారు. ఆదివారం పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. 19న ప్రధాని పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు. బాబా శత జయంతి వేడుకల సందర్భంగా ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి రానుండటంతో అధికారులు సమన్వయంతో పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. సుమారు 5వేల మందితో భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

Similar News

News November 17, 2025

రష్యా నుంచి ఆయిల్ కొనే దేశాలపై 500% టారిఫ్!

image

రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేసే దేశాల కట్టడికి అమెరికా సెనేట్ కొత్త బిల్లు తెచ్చింది. అలాంటి దేశాలపై 500% టారిఫ్ విధించేలా తెచ్చే బిల్లును సెనేటర్ లిండ్సే ప్రతిపాదించారు. దీనికి ప్రెసిడెంట్ ట్రంప్ మద్దతిచ్చారు. దీంతో భారత్, చైనా లాంటి దేశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించినట్లు సమాచారం.

News November 17, 2025

PPP మోడల్‌లో ఆటోనగర్ బస్టాండ్ అభివృద్ధి.. ఉయ్యూరు, గుడివాడ కూడా?

image

విజయవాడ ఆటోనగర్ బస్టాండ్‌ను పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ విధానంలో అభివృద్ధి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 10 ప్లాట్‌ఫామ్స్, వ్యాపార సముదాయాలు ఉండేలా ప్లాన్ సిద్ధం చేశారు. అనుమతులు రాగానే కాంట్రాక్టర్‌కు పనులు అప్పగిస్తారు. రద్దీగా ఉన్న PNBSకి ప్రత్యామ్నాయంగా ఆటోనగర్ బస్టాండ్‌ను వినియోగించుకునే యోచనలో ఉన్నారు. ఉయ్యూరు, గుడివాడ బస్టాండ్‌ల అభివృద్ధికి కూడా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.

News November 17, 2025

సౌదీ బస్సు ప్రమాదం.. మృతుల వివరాలపై ఇంకా రాని స్పష్టత!

image

సౌదీ బస్సు <<18308554>>ప్రమాదంలో<<>> HYD వాసులు చనిపోయినట్లు వార్తలు రావడంతో యాత్రికుల బంధువులు ట్రావెల్ ఏజెన్సీల వద్దకు చేరుకుంటున్నారు. మల్లేపల్లిలోని అల్ మీనా ట్రావెల్స్ ద్వారా అసిఫ్‌నగర్ జిర్ర ప్రాంతం నుంచి 16మంది, మెహిదీపట్నం ఫ్లైజోన్ ట్రావెల్స్ ద్వారా 24మంది, మరో ఏజెన్సీ నుంచి ఇద్దరు సౌదీ వెళ్లినట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై MP అసద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారుల నుంచి సమాచారం సేకరిస్తున్నామన్నారు.