News November 17, 2025
నిజామాబాద్ అమ్మాయికి ‘బాలరత్న-2025’ అవార్డు

నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన తేలి విభశ్రీ ‘మల్టిపుల్ టాలెంట్ గర్ల్’, ‘బాలరత్న – 2025’ అవార్డులను అందుకుంది. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 6వ తరగతి చదువుతున్న విభ శ్రీ.. శాస్త్రీయ నృత్యం, వెస్ట్రన్, ఫోక్ పాటలు, పలు టీవీ షోలు, చలనచిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో సినీనటి ట్వింకిల్ కపూర్ చేతుల మీదుగా ఈ బాలకళాకారిణి అవార్డును స్వీకరించింది.
Similar News
News March 25, 2026
వంటగ్యాస్ బుకింగ్.. కొత్త రూల్

సిలిండర్ల కొరత నేపథ్యంలో బుకింగ్ రూల్స్‌ను ఆయిల్ కంపెనీలు మరింత కఠినతరం చేశాయి. డబుల్ సిలిండర్ ఉన్నవారు 35 రోజుల తర్వాతే రీఫిల్ బుక్ చేసుకోవాలని పేర్కొన్నాయి. ఇక ఉజ్వల కనెక్షన్ ఉన్నవారికి ఈ గడువు 45 రోజులు కాగా సింగిల్ సిలిండర్ ఉన్నవారు 25 రోజుల తర్వాత బుక్ చేయాలి. అంతకంటే ముందుగా చేసే బుకింగ్స్‌ను సిస్టమ్ ఆటోమేటిక్‌గా బ్లాక్ చేస్తుంది.
News March 25, 2026
కరెంట్ అఫైర్స్

* గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్-2026లో పాకిస్థాన్‌కు తొలి స్థానం
* Income Tax Act 2025పై అవగాహన కోసం ‘PRARAMBH 2026’ ప్రారంభం
* టెక్స్‌టైల్ ఎక్స్‌పోర్ట్స్‌లో 2024-25లో తమిళనాడు టాప్
* అరుణాచల్ ప్రదేశ్‌లోని జిరో లోయలో ఒక కొత్త అడవి కివీ జాతి Actinidia indicaని BSI కనుగొంది.
* ఢిల్లీలో జరిగిన ప్రకృతి-2026లో కార్బన్ ట్రేడింగ్, క్లైమెట్ యాక్షన్ క్రమబద్ధీకరణకు ఇండియన్ కార్బన్ మార్కెట్ పోర్టల్ ఏర్పాటు.
News March 25, 2026
పవన్ సినిమాల్లో నటించొద్దని పిటిషన్.. కొట్టేసిన హైకోర్టు

AP: సినిమాల్లో నటించకుండా Dy.CM పవన్ కళ్యాణ్‌పై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ‘హరిహరవీరమల్లు’ టికెట్ ధరల పెంపు విషయంలో చట్టనిబంధనలు అనుసరించలేదని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మాజీ IAS అధికారి విజయ్ కుమార్ ఆరోపించారు. నిర్మాత అభ్యర్థన మేరకే ప్రభుత్వం టికెట్ ధరలు పెంచిందని.. సీఎం, మంత్రులు సినిమాల్లో నటించడంపై ఎలాంటి నిషేధం లేదని పవన్ తరఫు లాయర్లు వాదించారు.


