News November 17, 2025
వరంగల్: నేడు జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు బంద్

సీసీఐ నిబంధనల పట్ల ఆందోళనతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జిన్నింగ్ మిల్లర్లు నేడు పత్తి కొనుగోళ్లు నిలిపివేశారు. మిల్లులను ఎల్1, ఎల్2 కేటగిరీలుగా విభజించడం, తక్కువ పరిమాణంలోనే కొనుగోలు అనుమతించడం వల్ల మిల్లర్లకు నష్టం జరుగుతోందని అసోసియేషన్ తెలిపింది. అకాల వర్షాలతో దిగుబడి పడిపోయిన రైతులు మళ్లీ కొనుగోళ్లు ఆగిపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 17, 2025
మెదక్: సొసైటీ డైరెక్టర్ మృతి

చిన్న శంకరంపేట మండలం జంగారాయి సొసైటీ డైరెక్టర్ సిద్ది రెడ్డి అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సిద్ది రెడ్డి మృతితో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన సిద్ది రెడ్డి కుటుంబాన్ని సొసైటీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో పాటు డైరెక్టర్‌లు వివిధ పార్టీల రాజకీయ నాయకులు పరామర్శించారు.
News November 17, 2025
తిరుపతి: ఇప్పటి వరకు 231 మంది అరెస్ట్

ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు రెడ్ శాండిల్ టాస్క్‌ఫోర్స్ అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు పలు కేసులు కేసులు నమోదు చేశారు. 231 మందిని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచారు. దాదాపు 1,778 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాకు వినియోగించిన 57వాహనాలను సీజ్ చేసినట్లు రెడ్ శాండిల్ టాస్క్‌ఫోర్స్ తిరుపతి ఎస్పీ శ్రీనివాస్ వెల్లడించారు.
News November 17, 2025
రష్యా నుంచి ఆయిల్ కొనే దేశాలపై 500% టారిఫ్!

రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేసే దేశాల కట్టడికి అమెరికా సెనేట్ కొత్త బిల్లు తెచ్చింది. అలాంటి దేశాలపై 500% టారిఫ్ విధించేలా తెచ్చే బిల్లును సెనేటర్ లిండ్సే ప్రతిపాదించారు. దీనికి ప్రెసిడెంట్ ట్రంప్ మద్దతిచ్చారు. దీంతో భారత్, చైనా లాంటి దేశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించినట్లు సమాచారం.


