News November 17, 2025
పర్యాటకుల స్వర్గధామం మన పల్నాడు.!

పల్నాడు జిల్లా పర్యాటకుల స్వర్గధామంగా ఉంది. కృష్ణా నది ప్రవాహం, సహజ వనరులతోపాటు ప్రముఖ పర్యాటక ప్రాంతాలు జిల్లా పరిధిలో ఉన్నాయి. అమరావతి, ధ్యానబుద్ధ, నాగార్జునసాగర్, ఎత్తిపోతల, పులిచింతల కోటప్పకొండ, కొండవీడు, గుత్తికొండ, దైదబిలం, పల్నాడు వీరుల గుడి వంటి చారిత్రక స్థలాలు, దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. జిల్లాలో పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేసి, సందర్శకులను ఆకర్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
Similar News
News March 12, 2026
విశాఖకు మరో ఐటీ కంపెనీ

విశాఖలో ప్రముఖ IT సంస్థ క్యాప్‌జెమిని కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. శాశ్వత క్యాంపస్ ఏర్పాటుకు ముందు తాత్కాలిక కార్యాలయం ప్రారంభించాలని నిర్ణయించింది. దీనికోసం సెంట్రల్ పార్కు రోడ్డులోని భవనాన్ని అద్దెకు తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మధురవాడ IT హిల్స్, కొమ్మాది, ఆనందపురం ప్రాంతాల్లో 25-30 ఎకరాల భూమిని పరిశీలిస్తున్నారు. ఈ సంస్థ ప్రతినిధులతో మంత్రి లోకేశ్ నేడు భేటీ కానున్నారు.
News March 12, 2026
‘అనకాపల్లిలో ప్రభుత్వ సేవలపై ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరిగింది’

అనకాపల్లి జిల్లాలో ప్రభుత్వం సేవలపై ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరిగిందని కలెక్టర్ల సస్సుదలో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 2025 డిసెంబర్లో జిల్లాలో ప్రభుత్వ సేవలపై సంతృప్తి శాతం 67.8 ఉండగా.. జనవరి, ఫిబ్రవరి నెలలో 16 శాతం పెరిగిందన్నారు. పరిపాలనలో వేగం కారణంగా ప్రజల్లో విశ్వాసం పెరిగిందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో ప్రభుత్వ శాఖల అందిస్తున్న సేవలపై రియల్ టైం గవర్నెన్స్ ద్వారా వివరాలు సేకరించామన్నారు.
News March 12, 2026
రేషన్ కార్డులపై సంచలన నిర్ణయం

AP: రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సూపర్ సిక్స్ సహా అన్ని పథకాల అమలుకు ఫ్యామిలీ కార్డు తీసుకొస్తున్నట్లు ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ వెల్లడించారు. దీనికి రేషన్ కార్డులతో సంబంధం ఉండదన్నారు. ఈ విధానంపై క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం కోటిన్నర BPL కుటుంబాలు ఉన్నాయని, ఆ జాబితా నుంచి రెండేళ్లలో 5L ఫ్యామిలీలు బయట పడతాయని పేర్కొన్నారు.


