News November 17, 2025
నిడిగొండ: దీపాల కాంతుల్లో నిడిగొండ త్రికూటాలయం.!

రఘునాథపల్లి మండలం నిడిగొండలోని త్రికూటాలయం ఆదివారం సాయంత్రం జరిగిన కార్తీక దీపోత్సవంతో వెలుగులీనింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, యువత ఉత్సాహంగా పాల్గొని కార్తీక దీపాలను వెలిగించారు. దీపాల కాంతుల్లో త్రికూటాలయం అయోధ్య రామమందిరాన్ని పోలి ఉందనే దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Similar News
News November 17, 2025
బాపట్ల బీచ్ అభివృద్ధికి ఒప్పందం.. వెయ్యి ఉద్యోగాలు వచ్చే ఛాన్స్

విశాఖపట్నంలో జరిగిన CII సదస్సులో గుంటూరు జిల్లా కి చెందిన భ్రమరా గ్రూప్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. బాపట్ల సూర్యలంక బీచ్ పరిసర ప్రాంతంలో సుమారు రూ.360 కోట్ల పెట్టుబడితో బీచ్ రిసార్ట్ నిర్మించేందుకు సంస్థ ఛైర్మన్ గల్లా రామచందర్రావు ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 1000 మందికి ఉద్యోగ అవకాశం కలుగుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
News November 17, 2025
పైరసీ సైట్లను ఎంకరేజ్ చేయవద్దు: సజ్జనార్

TG: ఐబొమ్మ రవి సినిమాలను పైరసీ చేయడమే కాకుండా బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేశాడని HYD CP సజ్జనార్ తెలిపారు. ‘రవిని పోలీస్ కస్టడీకి కోరాం. విచారణలో పూర్తి వివరాలు రాబడతాం. పైరసీ చేసినా, చూసినా నేరమే. యూజర్ల డివైజ్‌లలోకి మాల్వేర్ పంపి వ్యక్తిగత డేటా సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. ఇలాంటి సైట్లను ఎంకరేజ్ చేయవద్దు’ అని సూచించారు.
News November 17, 2025
మెదక్: శీతాకాలం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి: ఎస్పీ

మెదక్ జిల్లా పరిధిలో శీతాకాలం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ డీవీ.శ్రీనివాస రావు సూచించారు. చలి తీవ్రత ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు పేరుకు పోవడం వల్ల రహదారులపై ముందు ఉన్న వాహనాలు కనిపించక ప్రమాదలు జరిగే ప్రమాదం ఉందన్నారు. ఈ సమయంలో ప్రమాదాలు జరగకుండా అన్ని వాహనదారులు స్పష్టమైన గాజు ఉన్న హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, హై-బీమ్ వాడరాదని, లో-బీమ్ లైట్లు మాత్రమే ఉపయోగించాలని సూచించారు.


