News November 17, 2025

సీసీఐ నిబంధనలపై నిరసన.. నేటి నుంచి పత్తి కొనుగోళ్లు బంద్

image

ఖమ్మం: సీసీఐ విధించిన కొత్త నిబంధనలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర కాటన్ ట్రేడర్స్, మిల్లర్స్ అసోసియేషన్ నేటి నుంచి పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. జిన్నింగ్ మిల్లులను ఎల్-1, ఎల్-2, ఎల్-3గా విభజించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొనుగోళ్లు ఆగిపోతే రైతులకు మద్దతు ధర దక్కదని, సమస్యను తక్షణమే పరిష్కరించాలని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News March 5, 2026

ముంబై పోర్ట్ అథారిటీలో 26 పోస్టులు

image

<>ముంబై<<>> పోర్ట్ అథారిటీ 26 స్పెషలిస్ట్/ సూపర్ స్పెషలిస్ట్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి MBBSతో పాటు సంబంధిత విభాగంలో MD/DNB, DM, DrNB, పీజీ డిప్లొమా, M.Ch., MS, MDS అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 12 వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://mumbaiport.gov.in

News March 5, 2026

9న భీమవరం వస్తున్న షర్మిల!

image

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి ఈనెల 9న భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా కాళ్ల మండలంలో రచ్చబండ, భీమవరం ప్రకాశం చౌక్ నుంచి కార్నర్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు అంకెం సీతారామ్ గురువారం తెలిపారు. ఈ పర్యటనను విజయవంతం చేయాలని శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.

News March 5, 2026

ఖమ్మం: సర్కారు దవాఖానలో ‘దాహ’ మంటలు..

image

ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో తాగునీటి ఎద్దడి రోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వచ్చే వందలాది మంది రోగులు, వారి సహాయకులకు కనీసం మంచినీరు కూడా అందకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎండలు ముదురుతుండటంతో బయట నీళ్ల బాటిళ్లు కొనలేక పేదలు అవస్థలు పడుతున్నారు. గతంలో దాతలు ఏర్పాటు చేసిన ఆర్‌ఓ (RO) ప్లాంట్ ప్రస్తుతం నిరుపయోగంగా మారడంతో ఈ దుస్థితి నెలకొంది.