News November 17, 2025

తంగళ్లపల్లి: మానేరు వాగులో వ్యక్తి.. వివరాలు లభ్యం

image

మానేరు వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని సిరిసిల్ల అశోక్‌నగర్‌కు చెందిన చింతకింది సోమయ్య(55)గా పోలీసులు గుర్తించారు. SI ఉపేంద్ర చారి వివరాల ప్రకారం.. ముందుగా గుర్తుతెలియని మగ శవంగా పోలీసులు సోషల్ మీడియాలో నిన్న పోస్టు చేశారు. ఇది చూసిన మృతుడి భార్య వాణి.. సోమయ్య అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో ఈనెల 13న ఇంటి నుంచి వెళ్లాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. SI కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News March 16, 2026

NZB: ఆ కార్మికులకు హక్కులు, ప్రయోజనాలు వర్తింపజేయాలి: కలెక్టర్

image

వలస కార్మికులకు హక్కులు, ప్రయోజనాలు వర్తించేలా సంబంధిత శాఖల అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. కలెక్టర్ అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్‌లో వలస కార్మికుల సంక్షేమంపై జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఇటుక బట్టీలు, రైస్ మిల్లులు, తదితర చోట్ల పనిచేసే కార్మికులకు యాజమాన్యాలు తగిన సదుపాయాలు, కనీస వేతనాలు అమలు చేసేలా పర్యవేక్షించాలన్నారు.

News March 16, 2026

NZB: సమయపాలన పాటించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం

image

ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యే అధికారులు సమయపాలన పాటించాలని NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి పలువురు అధికారులు ఆలస్యంగా హాజరు కావడాన్ని గమనించిన కలెక్టర్ కార్యక్రమం ప్రారంభం అయ్యే నిర్ణీత సమయం ఉదయం 10.30 గంటల వరకు అధికారులు అందరూ హాజరు కావాలన్నారు. సోమవారం ప్రజావాణిలో 80 వినతులు అందగా వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు అందజేశారు.

News March 16, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారు వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,670
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,416
* వెండి 10 గ్రాముల ధర రూ.2585.