News November 17, 2025
వరంగల్: డా.చిట్టిబాబు ఇంటిపై సోదాలు

వరంగల్ జిల్లా ఖానాపురం(M)లో అర్షమొల ఆపరేషన్ వికటించిన ఘటనపై దర్యాప్తు వేగం పెంచిన అధికారులు, ఖానాపురంలో నకిలీ వైద్యుడు బైరూ చిట్టిబాబు ఇంటిపై సోదాలు నిర్వహించారు. ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన డైక్లోఫెనాక్, జెంటమైసిన్, డెక్సామెతాసోన్ సహా పలు ఇంజెక్షన్లు, పాత శస్త్రపరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అర్హత లేకుండా చికిత్సలు చేస్తున్న చిట్టిబాబుపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News March 7, 2026
తాడికొండలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

తాడికొండలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. Nine One Exchange యాప్ ద్వారా బెట్టింగ్ చేస్తున్న కిరణ్, గోపీ, వంశీ, ప్రతాప్‌లను అదుపులోకి తీసుకుని 4 ఫోన్లు, కంప్యూటర్ సామగ్రి, ₹3,550 స్వాధీనం చేసుకున్నారు. తాడికొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 7, 2026
నేటితో ముగియనున్న ఎర్రగట్టుగుట్ట జాతర బ్రహ్మోత్సవాలు

హసన్‌పర్తి మండలం భీమారంలో గత 5 రోజులుగా అంగరంగ వైభవంగా కొనసాగిన ప్రసిద్ధ శ్రీ ఎర్రగట్టుగుట్ట జాతర బ్రహ్మోత్సవాలు శనివారం సాయంత్రంతో ఘనంగా ముగియనున్నాయి. ముగింపు రోజున భక్తులు భారీ సంఖ్యలో జాతరకు తరలి రావడంతో జాతర ప్రాంగణం భక్తజనంతో కిటకిటలాడింది. భక్తులకు జాతరలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో ఎన్.వెంకట్రావు, ఆలయ ఛైర్మన్ మార్క రాజు, ధర్మకర్తలు, పోలీసులు తగు చర్యలు చేపట్టారు.
News March 7, 2026
HYD: డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు అలర్ట్.. వాళ్ల ఇళ్లు రద్దు !

డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారులు కాకుండా ఇతరులు నివసిస్తున్నా లేదా అద్దెకు ఇచ్చినా కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి వెంటనే నోటీసులు జారీ చేయాలని సూచించింది. నోటీసులకు స్పందించని పక్షంలో కేటాయింపులను రద్దు చేసి, అర్హులైన ఇతరులకు ఆ ఇళ్లను కేటాయించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.


