News November 17, 2025
తిరుచానూరులో శ్రీవారు తపస్సు చేశారని తెలుసా?

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి పద్మసరోవరానికి తూర్పువైపున శ్రీసూర్య నారాయణ స్వామివారి ఆలయం ఉంటుంది. శ్రీనివాసుడు స్వయంగా సూర్య స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించి మహాలక్ష్మీ కోసం తపస్సు చేశారు. 12 ఏళ్ల తర్వాత బంగారు పద్మంలో అమ్మవారు ఆవిర్భవించారు. ఈ ఆలయంలో వైఖానస ఆగమం ప్రకారం పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయాన్ని అనేకసార్లు పునరుద్ధరించారు. 1866 ఏప్రిల్ 23న హథీరాంజీ మఠం వారు జీర్ణోద్ధరణ చేశారు.
Similar News
News November 17, 2025
అంగన్వాడీ కేంద్రాల ద్వారా బలమైన బాల్యం: సీతక్క

బాల్యంలోనే చిన్నారులు ఆరోగ్యంగా ఉంటే భవిష్యత్తు బలంగా ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు క్రమం తప్పకుండా పౌష్ఠికాహారం అందిస్తున్నామని తెలిపారు. గర్భిణీలు, బాలింతలకు పుష్ఠికరమైన ఆహార పదార్థాలను అందిస్తున్నామన్నారు. కుళ్లిపోయిన కోడిగుడ్లు, నాసిరకం పాలను సరఫరాచేసే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చంటి పిల్లలు దేవుళ్లతో సమాని, వారిని సంరక్షిస్తామన్నారు.
News November 17, 2025
బల్కంపేట ఎల్లమ్మ గుడిలో కార్తీక పూజలు

పవిత్ర కార్తీక మాసంలో 4వ సోమవారం సందర్భంగా మహానగరంలోని పలు శివాలయాలు, ఇతర దేవాలయాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. శివనామ స్మరణతో నగరంలోని ఆలయాలు మార్మోగాయి. ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేకువ జాము నుంచే అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. భారీగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
News November 17, 2025
సత్యసాయి భక్తుల కోసం ‘SAI100’ యాప్

పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం ‘SAI100’ యాప్‌ను ఆవిష్కరించినట్లు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. యాప్‌లో రోజు వారీగా ఈవెంట్ కార్యకలాపాలు, వసతి, వాహనాల పార్కింగ్ ప్రాంతాలు, తాగునీటి పాయింట్లు, ఆహార పంపిణీ కేంద్రాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్ తదితర వివరాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ యాప్‌ను భక్తులు, అధికారులు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.


