News November 17, 2025
నల్గొండ: ఆరుగురు డిశ్చార్జి.. 11 మందికి చికిత్స

ఇంజెక్షన్ వికటించి అస్వస్థతకు గురైన 17 మంది చిన్నారులు ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. కొంతమంది ఆదివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వైద్యులు పై అధికారులకు సమాచారం ఇచ్చి.. వారి సలహాల మేరకు వైద్యం అందించడంతో పిల్లలంతా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆదివారం ఆరుగురు చిన్నారులు డిశ్చార్జ్ అయినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ భానుప్రసాద్ తెలిపారు. 11 మంది చికిత్స పొందుతున్నారన్నారు.
Similar News
News March 5, 2026
NLG: మూడు నెలల బియ్యం.. ఇక ఒకేసారి!

కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఏప్రిల్ నెలలోనే ఒకేసారి పంపిణీ చేయనున్నారు. ఒక్కో యూనిట్‌కు నెలకు 6 కిలోల చొప్పున, 3 నెలలకు కలిపి 18 కిలోలు ఇవ్వనున్నారు. జిల్లాలోని 5.38 లక్షల మంది కార్డుదారులకు దీనివల్ల లబ్ధి చేకూరుతుంది. 1051 రేషన్ షాపులకు 23,700 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తరలించాలని ఎఫ్సీఐ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
News March 5, 2026
దివ్యాంగులు, వయోవృద్ధులకు ప్రత్యేక ప్రజావాణి: కలెక్టర్

జిల్లాలోని దివ్యాంగులు, వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికి ఈనెల 7న కలెక్టరేట్‌లో ‘ప్రత్యేక ప్రజావాణి’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ తెలిపారు. శనివారం ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. బాధితులు నేరుగా వచ్చి తమ విన్నపాలను అందజేయవచ్చని, అధికారులు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు.
News March 5, 2026
నల్గొండ: ఈ ఆలయానిది 200 ఏళ్ల చరిత్ర

చండూరు మండలం తుమ్మలపల్లిలోని శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయానికి 200 ఏళ్ల చరిత్ర ఉంది. కోనేరు వద్ద వెలిసిన లింగాన్ని చూసి రామ్‌సింగ్, పీత సింగ్ సోదరులు ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. 1895లో రాపోలు సాదుపుల్లయ్య ఇక్కడ శివరాత్రి కళ్యాణ వేడుకలు ప్రారంభించగా, నిజాం ప్రభుత్వం ఆలయానికి 28 ఎకరాల భూమిని మంజూరు చేసింది. ఏ కాలంలోనూ ఎండిపోని ‘పుట్టుగుండం’ ఇక్కడి ప్రత్యేకత.


