News November 17, 2025
నల్గొండ: డీసీసీలపై మళ్లీ కసరత్తు..!

అర్ధంతరంగా ఆగిపోయిన DCC అధ్యక్షుల ఎంపిక ప్రక్రియపై TPCC మళ్లీ దృష్టి సారించింది. త్వరలోనే DCC రథసారథులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఒక్కో జిల్లా నుంచి ఎమ్మెల్యేలు, సీనియర్ల నుంచి తుది అభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. వాస్తవానికి ఈ నెల మొదటి వారంలోనే ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అక్టోబర్‌లో NLG, SRPT, యాదాద్రి జిల్లాల్లో కార్యాచరణ చేపట్టిన విషయం తెలిసిందే.
Similar News
News November 17, 2025
సత్యసాయి భక్తుల కోసం ‘SAI100’ యాప్

పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం ‘SAI100’ యాప్‌ను ఆవిష్కరించినట్లు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. యాప్‌లో రోజు వారీగా ఈవెంట్ కార్యకలాపాలు, వసతి, వాహనాల పార్కింగ్ ప్రాంతాలు, తాగునీటి పాయింట్లు, ఆహార పంపిణీ కేంద్రాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్ తదితర వివరాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ యాప్‌ను భక్తులు, అధికారులు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
News November 17, 2025
వేరుశనగ పంట కోత.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వేరుశనగ పంట కోత సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్కలను పీకేటప్పుడు నేల గుల్లగా ఉండేలా చూసుకోవాలి. పంటలో 70 నుంచి 80 శాతం మొక్కల ఆకులు, కొమ్మలు పసుపు రంగులోకి మారి, కాయడొల్ల లోపల భాగం నలుపు రంగులోకి మారినప్పుడే పంటను కోయాలి. కోత సమయంలో నేలలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. మొక్క నుంచి కాయలను వేరుచేశాక కాయలను నిల్వచేసినప్పుడు, బూజుతెగులు రాకుండా స్థానిక వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకోవాలి.
News November 17, 2025
VIRAL: ప్రభాస్ లేటెస్ట్ లుక్

పాన్ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ లుక్ ఫొటోలు వైరలవుతున్నాయి. ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన ఏపీ డిప్యూటీ స్పీకర్ RRR, నటుడు సుబ్బరాజుతో కలిసి ఫొటోలు దిగారు. ఎప్పుడూ తలకు క్లాత్ ధరించి కనిపించే ఆయన చాలారోజుల తర్వాత ఇలా దర్శనమిచ్చారు. ప్రస్తుతం ఆయన ‘రాజాసాబ్’, ‘స్పిరిట్’, ‘ఫౌజీ’ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.


