News November 17, 2025
అల్లూరి: బర్త్‌డే కేకు తిన్న విద్యార్థినిలకు తీవ్ర అస్వస్థత

కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న 24 విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం రాత్రి పాఠశాలలో ఓ విద్యార్థిని బర్త్ డే సందర్భంగా కట్ చేసిన కేకును తిని, విద్యార్థినులు వాంతులు చేసుకున్నారు. దీంతో వారిని స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. విషమంగా ఉన్న ఇద్దరు విద్యార్థులను ఆదివారం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఏటీడబ్ల్యూవో క్రాంతి కుమార్ పర్యవేక్షిస్తున్నారు.
Similar News
News November 17, 2025
అంగన్వాడీ కేంద్రాల ద్వారా బలమైన బాల్యం: సీతక్క

బాల్యంలోనే చిన్నారులు ఆరోగ్యంగా ఉంటే భవిష్యత్తు బలంగా ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు క్రమం తప్పకుండా పౌష్ఠికాహారం అందిస్తున్నామని తెలిపారు. గర్భిణీలు, బాలింతలకు పుష్ఠికరమైన ఆహార పదార్థాలను అందిస్తున్నామన్నారు. కుళ్లిపోయిన కోడిగుడ్లు, నాసిరకం పాలను సరఫరాచేసే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చంటి పిల్లలు దేవుళ్లతో సమాని, వారిని సంరక్షిస్తామన్నారు.
News November 17, 2025
బల్కంపేట ఎల్లమ్మ గుడిలో కార్తీక పూజలు

పవిత్ర కార్తీక మాసంలో 4వ సోమవారం సందర్భంగా మహానగరంలోని పలు శివాలయాలు, ఇతర దేవాలయాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. శివనామ స్మరణతో నగరంలోని ఆలయాలు మార్మోగాయి. ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేకువ జాము నుంచే అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. భారీగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
News November 17, 2025
సత్యసాయి భక్తుల కోసం ‘SAI100’ యాప్

పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం ‘SAI100’ యాప్‌ను ఆవిష్కరించినట్లు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. యాప్‌లో రోజు వారీగా ఈవెంట్ కార్యకలాపాలు, వసతి, వాహనాల పార్కింగ్ ప్రాంతాలు, తాగునీటి పాయింట్లు, ఆహార పంపిణీ కేంద్రాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్ తదితర వివరాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ యాప్‌ను భక్తులు, అధికారులు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.


