News November 17, 2025
భారతీయ ఉద్యోగికి UAE అత్యుత్తమ బహుమతి!

UAE ఇచ్చే ‘అత్యుత్తమ ఉద్యోగి’ బహుమతిని ఇండియన్ గెలుచుకున్నారు. బుర్జీల్ హోల్డింగ్స్‌లో HR మేనేజర్‌గా అనాస్ కడియారకం(KL) పని చేస్తున్నారు. ఎమిరేట్స్ లేబర్ మార్కెట్ అవార్డ్స్‌లో అత్యుత్తమ వర్క్‌ఫోర్స్ కేటగిరీలో ఫస్ట్ ప్రైజ్ సాధించారు. ఆయనకు ట్రోఫీ, ₹24L, బంగారు నాణెం, యాపిల్ వాచ్, ఫజా ప్లాటినం కార్డు అందజేశారు. గతంలో కరోనా టైమ్‌లో సేవలకు హీరోస్ ఆఫ్ ది UAE మెడల్, గోల్డెన్ వీసాను అనాస్ అందుకున్నారు.
Similar News
News March 18, 2026
ICC ర్యాంకింగ్స్.. కోహ్లీ, రోహిత్ స్థానాలివే..

ICC ప్రకటించిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో NZ బ్యాటర్ మిచెల్ తొలి స్థానంలో నిలిచారు. భారత బ్యాటర్లు కోహ్లీ(2), రోహిత్(4), గిల్(5), రాహుల్ (9) టాప్-10లో ఉన్నారు. బౌలింగ్‌లో భారత్ నుంచి కుల్దీప్(8) ఒక్కరే టాప్-10లో నిలిచారు. ఆల్‌రౌండర్లలో అక్షర్ పదో స్థానంలో ఉన్నారు. అటు T20 బ్యాటింగ్‌లో అభిషేక్(1), ఇషాన్(2), తిలక్(6), సూర్య(9) టాప్-10లో ఉన్నారు. బౌలర్లలో వరుణ్ 2, బుమ్రా 5వ స్థానంలో నిలిచారు.
News March 18, 2026
కావ్యా.. కాల్ చెయ్: లలిత్ మోదీ

పాక్ బౌలర్ అబ్రార్‌ను సన్‌రైజర్స్ కొనుగోలు చేసిన <<19366541>>వివాదం<<>>లోకి IPL ఫౌండర్ లలిత్ మోదీ ఎంటర్ అయ్యారు. ‘ఫ్యాన్స్ ఆవేశంలో ఉన్న సమయంలో ఒక పాక్ ప్లేయర్‌పై ₹2.34 కోట్లు ఇన్వెస్ట్ చేయడమా? ప్రజాభిప్రాయాన్ని ఎలా మేనేజ్ చేయాలో, సామ్రాజ్యాలను ఎలా నిర్మించాలో నాకు బాగా తెలుసు. నాకు కాల్ చెయ్’ అంటూ పరోక్షంగా SRH ఓనర్ కావ్యా మారన్‌ను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు.
News March 18, 2026
₹2.40 లక్షలిస్తాం.. ఇండియాకు వెళ్లిపోండి: US

అక్రమ వలసదారులు తమ దేశం విడిచి వెళ్లాలని US మరోసారి కోరింది. చట్టవిరుద్ధంగా నివసిస్తున్నందుకు వేసిన ఫైన్స్‌ను రద్దు చేయడంతో పాటు ఫ్రీగా ఫ్లైట్ టికెట్లు అందజేస్తామని పేర్కొంది. అలాగే ₹2,40,329 ఎగ్జిట్ బోనస్ కింద ఇస్తామని తెలిపింది. ఈ క్రమంలో అక్కడి హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ ప్రకటనతో పాటు తాజ్‌మహల్ ఫొటోను పోస్ట్ చేసి ‘Fly to India For Free’ అంటూ రాయడం చర్చనీయాంశమైంది.


