News April 12, 2024
ఇంటర్ RESULTS.. కీలక అప్‌డేట్

AP: ఇవాళ ఇంటర్ ఫలితాలు విడుదల కాగా.. ప్రాక్టికల్స్ ఫెయిల్ అయిన వారికి బోర్డు కీలక ప్రకటన చేసింది. ప్రాక్టికల్ పరీక్షలు మే 1 నుంచి 4వ తేదీ వరకు జిల్లా కేంద్రాల్లో మాత్రమే నిర్వహిస్తామని వెల్లడించింది. థియరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తారు. మార్కులు తక్కువ వచ్చిన విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు కూడా రాసుకోవచ్చని పేర్కొంది.
Similar News
News March 3, 2026
భారత్ యుద్ధానికి రెడీ అవుతోంది: పాక్ ప్రెసిడెంట్

భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోందంటూ పాక్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ సంచలన ఆరోపణలు చేశారు. ‘యుద్ధ క్షేత్రం నుంచి చర్చల టేబుల్ వద్దకు రండి’ అంటూ పార్లమెంట్ సాక్షిగా ఢిల్లీకి విజ్ఞప్తి చేశారు. మరోవైపు అఫ్గాన్‌ను భారత్ అనుకూల దేశంగా అభివర్ణించారు. వారిని సైతం చర్చలకు రావాలని కోరారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ గతంలో చేసిన మెరుపు దాడులతో పాక్ బెంబేలెత్తిపోయిన విషయం తెలిసిందే.
News March 3, 2026
ప్రపంచ యాత్రికుడు.. 24 ఏళ్ల వయసులోనే!

బిహార్‌కు చెందిన 24 ఏళ్ల కుర్రాడు నోమాడ్ శుభమ్ ప్రపంచ దేశాలను చుట్టేసి రికార్డు సృష్టించారు. మొత్తం 197 దేశాలను చుట్టేసిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా నిలిచాడు. అయితే విమానాల్లో ప్రయాణించకుండా కేవలం లిఫ్టులు, లోకల్ బస్సుల్లో వెళ్తూ ఈ ఘనత సాధించడం విశేషం. తన 16ఏళ్ల వయసులో మొదలైన ఈ సాహసయాత్ర 9ఏళ్ల పాటు కొనసాగి తాజాగా బ్రెజిల్‌లో ముగిసింది. సంకల్పం ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చని శుభమ్ నిరూపించాడు.
News March 3, 2026
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

<


