News November 17, 2025

నాగర్ కర్నూల్ జిల్లాలో పెరిగిన ‘చలి పులి’

image

నాగర్ కర్నూల్ జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో అమ్రాబాద్, బిజినపల్లిలో అత్యల్పంగా 10.9 కనిష్ఠ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. వెల్దండలో 11.2, పదరలో 11.5, ఐనోల్ 11.6, అచ్చంపేట 11.7, ఊర్కొండలో 11.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఉదయం వేళల్లో చలి కారణంగా జిల్లా ప్రజలు స్వల్ప ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Similar News

News November 17, 2025

చిన్న బ్యాంకుల విలీనానికి కేంద్రం యోచన

image

ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్యను కుదించాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం ఇవి 12 ఉండగా 6 లేదా 7కు తగ్గించాలని నిర్ణయించినట్లు ‘ఇన్‌ఫార్మిస్ట్’ రిపోర్టు పేర్కొంది. చిన్న బ్యాంకులను SBI, PNBలతో అనుసంధానించడం లేదంటే నేరుగా విలీనం చేయాలనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్లు వివరించింది. విలీనంతో వాటిని పెద్ద సంస్థలుగా మార్చడం వల్ల స్థిర ప్రణాళికతో లాభాలు ఆర్జించొచ్చని భావిస్తున్నట్లు నివేదించింది.

News November 17, 2025

పశువుల మేతగా.. పంటకు ఎరువుగా ‘అజొల్లా’

image

‘అజొల్లా’ అనేది పుష్పించని ఆకుపచ్చ ‘ఫెర్న్’జాతికి చెందిన మొక్క. ఇది నీటి మీద తేలుతూ పెరిగే నాచులా ఉంటుంది. ఈ మొక్క పంటసాగులో పచ్చిరొట్టగా, జీవన ఎరువుగా, పశువుల మేతగా ఉపయోగపడుతుంది. రైతులు అజోల్లా సాగు చేపట్టి వారి పొలంలో వేసుకోవడమే కాకుండా పాడి పశువులకు, కోళ్లు, మేకలు, గొర్రెలు, చేపలకు దాణాగా అందించవచ్చు. దీని వల్ల అతి తక్కువ ఖర్చులో బహుళ ప్రయోజనాలను పొందవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.

News November 17, 2025

అజొల్లాను ఎలా ఉత్పత్తి చేయవచ్చు?(1/2)

image

చెట్ల నీడలో గోతులు తవ్వి లేదా సిమెంట్ తొట్టెలలో లేదా పోర్టబుల్ కంటైనర్‌ ఉపయోగించి అజొల్లాను పెంచవచ్చు. గోతులు తవ్వి అజొల్లాను పెంచితే బయటి నుంచి ఎటువంటి వేర్లు లోపలికి రాకుండా ప్లాస్టిక్ సంచులను గోతి లోపల పరచాలి. దాని మీద పాలిథీన్ షీట్ పరిచి నీరు నిల్వ ఉంచే కృత్రిమ తొట్టెలా తయారు చేసుకోవాలి. 10-15 కిలోల సారవంతమైన మట్టిని జల్లెడ పట్టి మొత్తని మట్టిని షీట్ మీద గోతిలో ఒకే విధంగా ఉండేలా చల్లుకోవాలి.