News November 17, 2025
KNR: ఇందిరమ్మ నమూనా ఇళ్లు .. రూ.3 కోట్లు వృథానేనా..?

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మండల కేంద్రాల్లో రూ.3 కోట్లతో 60 ఇందిరమ్మ ఇళ్ల నమూనా గృహాలను గృహ నిర్మాణ సంస్థ నిర్మించింది. అయితే లబ్ధిదారులు జిల్లా కేంద్రానికొచ్చి నమూనా గృహాన్ని చూసి వెళ్లే వీలున్నప్పటికీ మండల కేంద్రాల్లో ఇవి ఉండటంతో ప్రభుత్వంపై విమర్శలొస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభుత్వం ఇలాంటి సమయంలో అనాలోచిత నిర్ణయాలతో రూ.కోట్ల ప్రజాధనం వృథా చేయడమేంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
Similar News
News March 30, 2026
రేపు మాంసం దుకాణాలు బంద్

తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల రేపు మాంసం దుకాణాలు బంద్ కానున్నాయి. మహావీర్ జయంతి సందర్భంగా నాన్ వెజ్ షాపులు మూసేస్తున్నారు. GHMC పరిధిలోని కబేళాలు, మటన్ దుకాణాలు మంగళవారం మూసేయాలని అధికారులు నోటీసులు జారీ చేశారు.
News March 30, 2026
తిరుమలలో 560 ఏళ్ల నుంచి నిరంతరాయంగా.!

నేటి నుంచి 3 రోజులపాటు శ్రీవారి వార్షిక వసంతోత్సవాలకు తిరుమల ముస్తాబైంది. ఏటా స్వామికి వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు ఈ వేడుకలు చేస్తారు. ఆలయం వెనుక వసంతమండపంలో వేడుకలు జరగనున్నాయి. ఏటా చైత్రశుద్ద త్రయోదశి రోజున మొదలై చైత్ర పూర్ణిమ రోజు ముగిసేలా 1460లో విజయనగరరాజైన అచ్యుతరాయలు వీటిని ప్రారంభించినట్లు చరిత్ర చెబుతోంది. వసంత ఋతువులో జరుగుతున్న ఈ ఉత్సవాలకు వసంతోత్సవం అనే పేరు వచ్చింది.
News March 30, 2026
వసంతోత్సవం.. రెండో రోజు శ్రీవారికి తిరుమంజనం

వసంతోత్సవాల్లో భాగంగా రెండోరోజు మధ్యాహ్నం వసంత మండపంలో స్నపన తిరుమంజనం, అభిషేకాలు, సాయంత్రం తిరిగి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్న స్వామికి ఆస్థానం నిర్వహిస్తారు. మూడోరోజు మలయప్ప స్వామితో పాటు వేరు వేరు పల్లకీలలో రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి, సీతారామలక్ష్మణులను కూడా వసంత మండపానికి వేంచేపు చేస్తారు. అనంతరం ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనాది అభిషేకాలు నిర్వహించి తిరిగి ఆలయ ప్రవేశం చేస్తారు.


