News November 17, 2025
తెనాలి: విషాద ఘటనలు.. ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

తెనాలి నియోజకవర్గంలో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. తెనాలి నాజరుపేటకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి పవన్ తేజ (24) ఆలస్యంగా ఇంటికి రావడంతో తల్లి మందలించగా మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో ఘటనలో కొల్లిపర మండలం జముడుబాడుపాలెంకి చెందిన విద్యార్థిని లావణ్య (20) అనారోగ్య సమస్యలతో ఆదివారం ఉరి వేసుకొని చనిపోయింది. ఈ రెండు ఘటనలపై వన్‌టౌన్, కొల్లిపర పోలీసులు కేసులు నమోదు చేశారు.
Similar News
News November 17, 2025
మీ తీరు కోర్టు ధిక్కారమే.. TG స్పీకర్‌పై SC ఆగ్రహం

TG: MLAల కేసులో స్పీకర్ తీరుపై SC ఆగ్రహించింది. ‘వారిపై నిర్ణయం తీసుకుంటారా? ధిక్కారం ఎదుర్కొంటారా? మీరే తేల్చుకోండి’ అని CJI గవాయ్ స్పష్టంచేశారు. నూతన సంవత్సర వేడుకలు ఎక్కడ జరుపుకుంటారో స్పీకరే నిర్ణయించుకోవాలని వ్యాఖ్యానించారు. ఆయన తీరు కోర్టు ధిక్కారమేనన్నారు. ఆ MLAలపై వారంలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. గడువులోగా విచారణ పూర్తిచేస్తామని స్పీకర్ తరఫున రోహత్గీ, సింఘ్వీ తెలిపారు.
News November 17, 2025
ఒక్క రన్ కూడా ఇవ్వకుండా 5 వికెట్లు తీశాడు!

రంజీ ట్రోఫీలో భాగంగా హరియాణాతో జరుగుతున్న మ్యాచులో సర్వీసెస్ బౌలర్ అమిత్ శుక్లా 8 వికెట్లతో రాణించారు. ఒక్క రన్ కూడా ఇవ్వకుండా తొలి 5 వికెట్లను పడగొట్టిన శుక్లా, మొత్తంగా 20 ఓవర్లలో 27 పరుగులిచ్చి 8 వికెట్లు తీశారు. అతడి దెబ్బకు హరియాణా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 111 రన్స్‌కే ఆలౌటైంది. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఇప్పటివరకు 7 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 32 వికెట్లు పడగొట్టారు.
News November 17, 2025
తుని మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఫోన్ హ్యాక్

తుని మున్సిపల్ ఛైర్‌పర్సన్ నార్ల భువన సుందరి ఫోన్ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు ఆమె మొబైల్ ఫోన్‌లోని కాంటాక్ట్స్‌కి సందేశాలు పంపిస్తూ డబ్బులు పంపించాలని కోరుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై భువన సుందరి స్పందిస్తూ.. తమ పేరుతో వచ్చే ఎలాంటి సందేశాలకు స్పందించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డబ్బులు పంపించి ఎవరూ మోసపోవద్దన్నారు.


