News November 17, 2025
కొత్తగూడెంలో జాబ్ మేళా.. 2915 మందికి ఉద్యోగాలు

కొత్తగూడెం క్లబ్‌లో ఆదివారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు 8500 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. కాగా 2915 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. 65 కంపెనీలకు పైగా ఈ జాబ్ మేళాకు హాజరై నిరుద్యోగ అభ్యర్థుల దరఖాస్తులను స్వీకరించి ఇంటర్వ్యూ నిర్వహించారు. అర్హత సాధించిన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కూనంనేని, సీఎండీ బలరాం, కలెక్టర్, ఎస్పీ పాల్గొన్నారు.
Similar News
News March 12, 2026
HYD: గ్యాస్ లేకపోతే ఈ ఆలోచన మీకు రాదా?

రూ.5కే కడుపు నింపుతున్న సంస్థలు స్టీమ్ బాయిలర్లు వాడుతుంటే.. వేలల్లో బిల్లులు వసూలు చేసే 5 స్టార్ హోటళ్లు, హాస్టళ్లు గ్యాస్ వాడుతున్నాయి. గ్యాస్ ధర పెరిగిందని కస్టమర్ల జేబులు కత్తరించే బదులు హరే రామ హరే కృష్ణ ట్రస్ట్‌ల స్టీమ్ వంట పద్ధతికి మారితే ఖర్చు తగ్గుతుంది కదా. కార్పొరేట్ హాస్టళ్లు గ్యాస్ సంక్షోభం సాకుతో మెస్ ఛార్జీలు పెంచడం కరెక్టేనా? గ్యాస్ లేకపోతే.. స్టీమ్ బాయిలర్లు ఉన్నాయి. <<19364190>>సోచో జరా!<<>>
News March 12, 2026
పల్నాడు జిల్లాకు రూ.135.48 కోట్లు

అన్నదాత సుఖీభవ-PM కిసాన్ పథకం మూడో విడత నిధులు శుక్రవారం పల్నాడు జిల్లా రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. జిల్లాలో 2,40,530 మంది రైతులకు రూ.135.48 కోట్ల ఆర్థిక సహాయం అందనున్నట్లు కలెక్టర్ కృతిక శుక్లా గురువారం తెలిపారు. ఈ విడతలో రైతులకు రూ.6,000ల చొప్పున జమ అవుతుందన్నారు. రైతులు ఈ నిధులను తదుపరి పంట సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు వంటి వ్యవసాయ అవసరాలకు వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.
News March 12, 2026
ఖమ్మం: కావూరి సాంబశివరావుకు అంతిమ వీడ్కోలు

మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన మనవడు ఎంపీ శ్రీ భరత్‌తో పాటు కావూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, మధు యాష్కీ గౌడ్ తదితర ప్రముఖులు పాల్గొని నివాళులు అర్పించారు.


