News November 17, 2025
సూర్యాపేట: భార్యను రోకలిబండతో బాది హత్య

మోతే మండలంలోని సిరికొండ గ్రామంలో ఆదివారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. కారింగుల వెంకన్న అనే వ్యక్తి కుటుంబ కలహాల నేపథ్యంలో తన భార్య పద్మ(40)ను రోకలి బండతో బాది హత్య చేశాడు. ఆవేశానికి లోనైన వెంకన్న బలంగా తలపై కొట్టడంతో పద్మ అక్కడికక్కడే మృతి చెందిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న మోతే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News March 22, 2026
ప్రత్యేక ఫ్లైట్ డిమాండ్ చేసినట్లు వార్తలు.. కోహ్లీ రియాక్షన్ ఇదే!

ఐపీఎల్ కోసం RCB బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇప్పటికే బెంగళూరు చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే లండన్‌లో ఉంటున్న కోహ్లీ.. ఈ సీజన్‌లో రెగ్యులర్‌గా ఇంటికి వెళ్లి రావడానికి ప్రత్యేక ఫ్లైట్ అరేంజ్ చేయాలని RCB మేనేజ్మెంట్‌ను డిమాండ్ చేశారని పలు రిపోర్ట్స్ వచ్చాయి. దీనిని కోహ్లీ కొట్టిపారేశారు. ఈ వార్త హాస్యాస్పదంగా ఉందని సూచించేలా ఆ రిలేటెడ్ పోస్ట్ ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసి లాఫింగ్ ఎమోజీ పెట్టారు.
News March 22, 2026
పార్వతీపురం: ‘ PGRS వివరాల కోసం 1100కి ఫోన్ చేయండి’

పార్వతీపురం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోమవారం PGRS కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి కార్యాలయంలో ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించాలన్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్‌లో ప్రతిరోజూ వినతులు స్వీకరిస్తామన్నారు. అర్జీదారులు మీకోసం వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, వివరాలను 1100 నంబర్‌కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు అన్నారు.
News March 22, 2026
ఆదిలాబాద్: మూడు నెలల రేషన్ ఒకేసారి

పెరుగుతున్న ఎండల దృష్ట్యా రేషన్ లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయనుంది. నిర్మల్ జిల్లాలో 2.18 లక్షల మందికి, ఆదిలాబాద్‌లో 2.05 లక్షల కార్డుదారులకు ఈ వెసులుబాటు కలగనుంది. నిజామాబాద్ నుంచి బియ్యం సరఫరా వేగవంతమైంది. దీనివల్ల లబ్ధిదారులు ప్రతి నెలా ఎండలో వరుస కట్టాల్సిన అవస్థలు తప్పుతాయి.


