News November 17, 2025

KMR: డాక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

image

ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో డాక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కామారెడ్డి జిల్లా ఆస్పత్రుల పర్యవేక్షకురాలు డా.విజయలక్ష్మి తెలిపారు. బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్(గైనకాలజిస్ట్), అనస్థిషియా, ఎల్లారెడ్డిలో ఇద్దరు గైనకాలజిస్టులు, అనస్థీషియా, మద్నూర్‌లో GDMO పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ నెల 20 వరకు DCHS ఆఫిస్‌‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Similar News

News March 18, 2026

HNK: బాల్యానికి బ్రేక్ లేదు.. ట్రాఫిక్‌కు కట్టడి ఎక్కడ?

image

WGL ట్రై సీటీలో 15 ఏళ్లు కూడా నిండని చిన్నారులు నంబర్ ప్లేట్లు, హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతూ సిగ్నల్స్ వద్ద దర్జాగా ఆగడం కనిపిస్తోంది. ఇదే వరంగల్ పోలీసుల “ఎవర్ విక్టోరియస్” పనితీరా? అని ప్రజలు సర్కాస్టిక్‌గా ప్రశ్నిస్తున్నారు. ప్రమాదాలు జరిగిన తర్వాత కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

News March 18, 2026

గ్యాస్ సిలిండర్ల కొరత.. విజయవాడ హోటల్స్‌లో సాంబార్ కట్

image

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలతో ఇంధన సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో విజయవాడలోని పలు హోటల్స్‌లో మెనూ మారిపోయింది. గ్యాస్ సిలిండర్ల లభ్యత తగ్గడంతో టిఫిన్ హోటల్స్ నిర్వాహకులు ఫుడ్ ఐటమ్స్‌తో పాటు అందజేసే సాంబార్ తయారీ నిలిపివేశారు. సాంబార్‌తో పాటు కొన్ని ఐటమ్స్‌ను మెనూ నుంచి తొలగించినట్టు పలు హోటల్స్ నిర్వాహకులు బోర్డులు పెడుతున్నారు.