News November 17, 2025

హన్మకొండ: పైసా దేదో.. కామ్ ఖరో..!

image

హన్మకొండలో ఓ అధికారి లంచాల బాగోతం ముదిరిపోయింది. వివాదాస్పద స్థలాల కేసుల్లో అధికార నేతలతో కలిసి డబ్బులిస్తే చాలు వారికి అనుకూలంగా ఆర్డర్లను ఇస్తున్నారనేది బహిరంగంగా అందరికీ తెలిసింది. ఇటీవల HNK(M) సుబ్బయ్యపల్లి శివారులో సైతం 20ఎకరాల స్థలానికి సంబంధించిన కేసులో అనుకూలంగా ఆర్డర్ కోసం రూ.50లక్షల వరకు చేతులు మారినట్లు సమాచారం. దీంతో అవినీతి నిరోధక శాఖ మాత్రం చోద్యం చూస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Similar News

News November 17, 2025

అమలాపురంలో ఈనెల 18న జాబ్ మేళా

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని జాయింట్ కలెక్టర్ నిశాంతి అన్నారు. ఈనెల 18న అమలాపురంలోని గోదావరి భవన్ వద్ద జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేళాలో జాయిలుకాస్ సంస్థ ప్రతినిధులు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. సోమవారం కలెక్టరేట్ వద్ద జాబ్ మేళా గోడపత్రికలను ఆమె ఆవిష్కరించారు.

మత్స్యశాఖ ఇంచార్జి అధికారిగా కె. డోలిసింగ్

image

కామారెడ్డి నూతన జిల్లా మత్స్య శాఖ ఇంచార్జి అధికారిగా కె. డోలిసింగ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.
ఇంతకు ముందు ఈ పదవిలో ఉన్న శ్రీపతి వరంగల్, హన్మకొండ జిల్లాలకు వర్క్ డిప్యూటేషన్‌పై బదిలీ అయ్యారు.