News April 12, 2024

ప.గో.: ALERT: 14వ తేదీన వడగాలులు.. జాగ్రత్త

image

ఉమ్మడి ప.గో. జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. 14న పలు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. ప.గో. జిల్లాలో 2 మండలాల్లో, ఏలూరు జిల్లాలోని 5 మండలాల్లో వడగాలులు ఉండనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రజలు అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Similar News

News September 10, 2025

వ్యవసాయ సాగుపై రైతులు దృష్టి సారించాలి: కలెక్టర్

image

రసాయన రహిత వ్యవసాయ సాగుపై రైతులు దృష్టి సారించాలని, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం ద్వారా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పథకంలో భాగంగా కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇప్పటికే జిల్లాలో 75 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు నడుస్తోందన్నారు.

News September 10, 2025

అత్తిలిలో నేటి నుంచి ఎక్స్ ప్రెస్ రైళ్లకు హాల్ట్

image

అత్తిలి రైల్వే స్టేషన్‌లో బుధవారం నుంచి సర్కార్, తిరుపతి పూరీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆగనున్నాయి. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసేందుకు కూటమి నేతలు అత్తిలి మండలంలో ఆటో ప్రచారం ప్రారంభించారు. ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆగేందుకు గత కొంతకాలంగా చేస్తున్న పోరాటం ఫలించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 4న కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రైలు హాల్ట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.

News September 10, 2025

జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష

image

జిల్లాలో నిర్మాణం పూర్తి అయిన మల్టీపర్పస్ గోడౌన్లను తక్షణమే వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్షించారు. జిల్లాకు నాబార్డ్ మంజూరు చేసిన 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 24 మల్టీ పర్పస్ గోడౌన్స్‌లో 14 పూర్తి చేశామన్నారు. ఇంకా 10 గోడౌన్ల నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉందన్నారు.