News November 17, 2025

JGTL: కవిత వెంట ఉండేదెవరు.. వెళ్లేదెవరు..?

image

గతంలో ఓ వెలుగు వెలిగిన కవిత BRS నుంచి సస్పెన్షన్‌కు గురైన తర్వాత జాగృతి శ్రేణులతో జనంబాట పట్టారు. గతంలో జిల్లా నేతలకు కవితే పెద్దదిక్కుగా ఉండేవారు. ప్రస్తుతం మారిన పరిస్థితులతో నేడు స్తబ్ధుగా ఉన్నారు. మాజీ ZP ఛైర్పర్సన్ వసంత సురేష్ కవితకు నమ్మిన బంటుగా ఉండగా, మాజీ MLA విద్యాసాగర్ రావు, మాజీమంత్రి ఈశ్వర్, ఉద్యమ నాయకులు వెంటే ఉండేవారు. జనంబాట మన జిల్లాలో అడుగు పెడితే కవిత క్యాడర్ ఏంటో తెలుస్తుంది.

Similar News

News March 5, 2026

నాగోల్: CM రేవంత్‌కు KTR వార్నింగ్

image

CM రేవంత్ ఇల్లు రెడ్డి కుంటలో ఉందని KTR అన్నారు. నాగోల్ STP పరిశీలన అనంతరం ఆయన ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. CM సోదరుడి ఇల్లు కూడా దుర్గం చెరువులో ఉందని, మంత్రుల ఇండ్లు కూడా చెరువుల మధ్యలో ఉన్నాయని ఆరోపించారు. వాటిని కూల్చే దమ్ము ఎవరికీ లేదన్నారు. అదే పేదవాడి భూమికి రిజిస్ట్రేషన్లు ఉన్నా కూల్చివేస్తున్నారని.. కానీ, పేదలు కుర్చి మడతపెట్టి కొట్టే రోజులు వస్తాయని CMకు KTR వార్నింగ్ ఇచ్చారు.

News March 5, 2026

ADB: ఇంటర్ పరీక్షకు 473 మంది గైర్హాజరు

image

ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 8123 మంది విద్యార్థులకు గాను 7650 మంది హాజరయ్యారని డీఐఈవో జాదవ్ గణేశ్ కుమార్ తెలిపారు. జనరల్ విభాగంలో 7104 విద్యార్థులకు గాను 348 మంది, ఒకేషనల్ విభాగంలో 1019.విద్యార్థులకు గాను 125 మంది కలిపి మొత్తం 473 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.

News March 5, 2026

బిడ్డను ఒడిలో పెట్టుకుని.. ఆధార్‌ సేవలు అందిస్తూ..

image

మాతృత్వపు బాధ్యతలను నిర్వహిస్తూనే.. వృత్తి పట్ల అంకితభావం చాటుతున్నారు ఆధార్ ఆపరేటర్ భూక్యా వెన్నెల. పాల్వంచ మండలం బసవతారక కాలనీ గ్రామ పంచాయతీలోని ఆధార్ సేవా కేంద్రంలో ఆమె విధులు నిర్వహిస్తున్నారు. ఏడాది వయసున్న తన చిన్నారిని ఒడిలో కూర్చోబెట్టుకుని నిత్యం వందలాది మందికి ఆధార్ సేవలు అందిస్తున్న తీరు స్థానికులను ఆకట్టుకుంటోంది. ఆమె సేవా దృక్పథాన్ని చూసి అక్కడికి వచ్చే వారు ప్రశంసిస్తున్నారు.