News November 17, 2025
MBNR: యువకుడి దారుణ హత్య.. నలుగురి అరెస్ట్

తమ్ముడి వివాహానికి సహకరించిన అన్నను <<18301281>>హత్య<<>> చేసిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో కలకలం రేపిన విషయం తెలిసిందే. పోలీసులు సోమవారం నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. గ్రామంలో కుటుంబీకులు అంత్యక్రియలు నిర్వహించనుండగా పోలీసులు భారీగా మోహరించారు. యువతి తండ్రి నుంచి తనకు ప్రాణహాని ఉందని రాజశేఖర్ తమ్ముడు చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News March 19, 2026
నాగర్‌కర్నూల్ జిల్లా DCC పూర్తిస్థాయి కార్యవర్గం

నాగర్‌కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ స్థాయి కార్యవర్గాన్ని TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గురువారం ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతోపాటు ఉపాధ్యక్షుడిగా కట్ట అనంతరెడ్డి, హరి నారాయణ గౌడ్, వెంకటస్వామి, మాధవరెడ్డి, రాము యాదవ్, జగదీశ్వరుడు, ప్రధాన కార్యదర్శిలుగా బలరాం గౌడ్, కృష్ణారెడ్డి, రామనాథం, వెంకట్ రెడ్డి, నాగేశ్వరరావు, రామలింగం యాదవ్‌లను నియమించారు.
News March 19, 2026
BREAKING: ప్రభుత్వ విప్‌లుగా వేముల, అద్దంకి

ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కీలక నేతలకు రాష్ట్ర ప్రభుత్వంలో సముచిత స్థానం దక్కింది. ప్రభుత్వ విప్‌లుగా శాసనసభలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, శాసనమండలిలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కీలకమైన పదవుల్లో రెండు జిల్లాకే దక్కడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. తమ నేతల నియామకంపై అనుచరులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు.
News March 19, 2026
అరుదైన బ్లడ్ గ్రూప్.. 50 మందికి మాత్రమే!

మనందరిలో ప్రధానంగా నాలుగు గ్రూపుల రక్తం ఉంటుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా 50 మందికి మాత్రమే ఉండే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ ‘Rh-Null’ అనే విషయం మీకు తెలుసా? దీనినే ‘గోల్డెన్ బ్లడ్’ అని పిలుస్తారు. ఇందులో ఏ రకమైన యాంటిజెన్లు ఉండవు, అందుకే ఈ రక్తం ఎవరికైనా సెట్ అవుతుంది. కానీ వీరికి రక్తం కావాలంటే మాత్రం దొరకడం చాలా కష్టం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో


