News November 17, 2025

హిందువులపై దాడులు బాధాకరం: షేక్ హసీనా

image

బంగ్లాదేశ్‌లో యూనస్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మైనార్టీలు, ముఖ్యంగా హిందువులపై దాడులను ప్రోత్సహిస్తోందని మాజీ PM షేక్ హసీనా మండిపడ్డారు. దీంతో వారంతా పారిపోవాల్సి వస్తోందన్నారు. దేశంలో హింస పెరిగిపోయిందని, ప్రజాస్వామ్యం, లౌకిక నిర్మాణం క్షీణిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. యువత ఆందోళనలతో హసీనా గతేడాది ఆగస్టు 5 నుంచి భారత్‌లో ఆశ్రయం పొందుతోన్న విషయం తెలిసిందే.

Similar News

News November 17, 2025

14,967 ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?

image

కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయల్లో 14,967 పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. PGT(2,996), ప్రైమరీ టీచర్(2,684), TGT(6,215), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(1,312)తో పాటు మరికొన్ని ఉద్యోగాలున్నాయి. ఈ జాబ్స్‌కు CBSE తొలుత ఉమ్మడి పరీక్ష నిర్వహించనుంది. రెండో దశలో పోస్టులను బట్టి ఎగ్జామ్, ఇంటర్వ్యూ/స్కిల్ టెస్టుతో ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ DEC 4.
* వెబ్‌సైట్: <>https://www.cbse.gov.in/<<>>

మాఘీ సీజన్, లేట్ రబీకి అనువైన జొన్న రకాలు

image

ఏపీలో కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో మాఘీ సీజన్ కింద.. లేట్ రబీ కింద ప్రకాశం, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో జొన్న పంటను సాగు చేస్తారు. ఈ సీజన్లకు అనువైన వరి రకాలు NTJ-5, N-15, C.S.V-15, C.S.V-17, C.S.V-23, C.S.V-31, M-35-1. అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలు C.S.H-14, C.S.H-15 R, C.S.H-18, C.S.H-16, C.S.H-35, C.S.H-23. నిపుణుల సూచన మేరకు ప్రాంతీయ పరిస్థితులకు అనుగుణంగా రకాలను ఎంపిక చేసుకోవాలి.