News November 17, 2025
అలంపూర్ జోగులాంబ ఆలయంలో నేడు దీపోత్సవం

జోగులాంబ బాల బ్రహ్మేశ్వర దేవస్థానంలో కార్తీక మాసం చివరి సోమవారం కావడం తుంగభద్ర పుష్కర్ ఘాటు దగ్గర సామూహిక దీపోత్సవం నిర్వహిస్తున్నారు. సాయంత్రం ఆరు గంటల నుంచి ఐదు వేల ప్రమిదలతో దీపాలు వెలిగించనున్నారు. భక్తులకు ఉచితంగా ప్రమిదలు, కుంకుమ, పసుపు, గాజులు ఇవ్వనున్నట్లు దేవస్థానం ఈవో దీప్తి తెలిపారు. దీపోత్సవం తర్వాత స్వామివారి రథోత్సవం జరుగుతుంది.
Similar News
News March 17, 2026
ఖమ్మం: మనస్తాపంతో పీజీ విద్యార్థిని ఆత్మహత్య

మనస్తాపంతో ఎలుకల మందు సేవించి ఓ పీజీ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయారు. ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడుకు చెందిన పి.శ్రీవిద్య కాకతీయ వర్సిటీలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదువుతున్నారు. ఈ నెల 7న మధిరలో విషగుళికలు సేవించగా.. తొలుత ఖమ్మం ఆ తర్వాత హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 17, 2026
‘ప్రభుత్వ’ ఇళ్లను అద్దెకు ఇస్తే రద్దు: పొంగులేటి

TG: డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివాసం ఉండని, అద్దెకు ఇస్తున్న వారికి నోటీసులివ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. మే 1 నుంచి క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని, నోటీసులకు స్పందించకపోతే ఇళ్లను రద్దు చేయాలని సూచించారు. వాటిని అర్హులకు కేటాయించాలన్నారు. నోటీసులకు స్పందించిన వారితో తాము ఆ ఇంట్లోనే ఉంటామని, లేదంటే ప్రభుత్వానికి అప్పగిస్తామని బాండు పేపర్‌పై రాయించుకోవాలని పేర్కొన్నారు.
News March 17, 2026
పాలమూరు: రూ.లక్ష బండిపై 90% సబ్సిడీ

SC నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నారాయణపేట కలెక్టరేట్ ప్రకటన విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 2 వీలర్‌కు 90%, 3 వీలర్‌కు 70% సబ్సిడీతో EV’s కొనుగోలుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆదాయ, కుల, రేషన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ జతచేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. రేపటి నుంచి 26 వరకు tgobmms.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. #SHARE IT


