News November 17, 2025
ములుగు: అంగన్వాడీ విద్యార్థులకు 100ml పాలు

అంగన్వాడీ ప్రీ స్కూల్స్‌లో నూతన పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మూడు నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులకు ప్రతిరోజు 100ml పాలను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ములుగు జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ప్రకటించారు. ఈరోజు ములుగులో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.
Similar News
News March 18, 2026
తాడూరులో 33.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

జిల్లాలోని పలుచోట్ల మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అకాల వర్షం కురిసింది. మధ్యరాత్రి రెండు గంటల తర్వాత ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. జిల్లాలోనే అత్యధికంగా తాడూరు మండలంలో 33.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. కోడేరులో 24.8, కల్వకుర్తిలో 18.8, బిజినేపల్లిలో 22.8, ఊర్కొండలో 18.3, నాగర్ కర్నూల్‌లో 18.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
News March 18, 2026
అమ్రాబాద్: రాత్రివేళల్లో ‘నైట్‌జార్’ పక్షి వింత శబ్దాలు

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో రాత్రిపూట చురుకుగా ఉండే ‘నైట్‌జార్’ పక్షి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. చెట్టు బెరడు రంగులో ఉండటం వల్ల పగలు దీనిని గుర్తించడం కష్టం. రాత్రి వేళల్లో ఇది చేసే వింత శబ్దాలను చూసి స్థానికులు వేరే జంతువులుగా భ్రమపడుతుంటారని అధికారులు తెలిపారు. పురుగులను ఆహారంగా తీసుకునే ఈ పక్షి అడవిలో ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటుంది.
News March 18, 2026
రేపు మచిలీపట్నంలో జిల్లా స్థాయి ఉగాది వేడుకలు

తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలను ఈ నెల 19వ తేదీన మచిలీపట్నంలోని బచ్చుపేట వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. జిల్లా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించనున్నారన్నారు. ఈ వేడుకలకు ఇన్‌ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ తోపాటు మంత్రి కొల్లు రవీంద్ర, ఇతర ప్రజాప్రతినిథులు పాల్గొంటారన్నారు.


